Prabhas Special Thanks Video :రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా తన ఫ్యాన్స్ కోసం ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు. అందులో ఆయన కల్కి సక్సెస్ గురించి మాట్లాడి అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు.'మీరు లేనిదే నేను లేను' అంటూ పేర్కొన్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లతో కలిసి నటించే అవకాశం ఇచ్చినందుకు మేకర్స్ కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
'స్వీట్ నోట్' అనే పేరుతో మూవీటీమ్ ఈ వీడియోను షేర్ చేయగా, అది క్షణాల్లో వైరల్ అయ్యింది. ఇది చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డార్లింగ్ స్వయంగా వచ్చి మనకు థ్యాంక్స్ చెప్పారంటూ సంబరాలు చేసుకున్నారు.
ఆర్ఆర్ఆర్ను బీట్ చేసిన కల్కి
రీసెంట్గా వరల్డ్‌వైడ్‌గా రూ.1000కోట్ల మార్క్ క్రాస్ చేసిన 'కల్కి 2898 AD' మూవీ తాజాగా మరో ఘనత సాధించింది. రిలీజైన మూడు వారాల్లోనే 'ఆర్ఆర్ఆర్' సినిమా హైదరాబాద్ ఫుల్ రన్ కలెక్షన్లను దాటేసి రికార్డుకెక్కేసింది.
హైదరాబాద్ నేషనల్ మల్టీప్లెక్స్‌లో 'ఆర్ఆర్ఆర్' ఫుల్ కలెక్షన్లు సుమారు రూ. 30.25 కోట్లు కాగా, ఇదే రీజన్లో 'కల్కి' ఇప్పటికే రూ. 33.50కోట్లు వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అలా మూడు వారాల్లోనే ఆర్ఆర్ఆర్ కంటే కల్కి దాదాపు రూ.3కోట్లు అధికంగా వసూళ్లు సాధించింది.