Prabhas Marriage :టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే చాలా మందికి ప్రభాస్ గుర్తొస్తారు. ఫ్యాన్స్ ముద్దుగా మిస్టర్ పర్‌ఫెక్ట్, డార్లింగ్‌గా పిలుచుకునే ప్రభాస్‌కి చాలా ఇంటర్వ్యూలు, టీవీ షోస్‌లో 'మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు?' అనే ప్రశ్న ఇప్పటి వరకు ఎన్నో సార్లు ఎదురైంది.
అన్ని సందర్భాల్లో ప్రభాస్, ఏదో ఒక ఆన్సర్ చెప్పి తప్పించుకుంటుంటారు. ఇటీవల కూడా 'నా జీవితంలోకి ఓ స్పెషల్ పర్సన్ రాబోతున్నారు.' అంటూ ట్వీట్ చేస్తే సోషల్ మీడియాలో షేక్ అయిపోయింది. తీరా పెళ్లి గురించి కాదని, 'కల్కి 2898 AD' ప్రమోషన్స్ కోసం పోస్ట్ చేశారని తెలిసి ఫ్యాన్స్ నిరాశచెందారు. అయితే ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదనే విషయాన్ని ఓ సారి స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి రివీల్ చేశారు. ఆయన ఏం చెప్పారంటే?
"ప్రభాస్ చాలా బద్ధకస్తుడు, పెళ్లి చేసుకోవడానికి కూడా బద్ధకం. ఒక అమ్మాయిని వెతికి, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి, ఇదంతా ప్రభాస్‌కి టూ మచ్ వర్క్. అందుకే అతను పెళ్లి చేసుకోవడం లేదు." అంటూ సరదాగా బదులిచ్చారు. 2018లో జరిగిన బాహుబలి ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ టాక్ షోలో టాక్ షోలో పాల్గొన్నప్పుడు రాజమౌళి ఈ కామెంట్స్ చేశారు.