Manchu Vishnu Kannappa Release Date : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం 'కన్నప్ప'. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్, పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఎలా ఉంటుందా, ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందా? అని సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు.
అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది. ఈ మేరకు విడుదల తేదీని మంచు విష్ణు ప్రకటించారు. వేసవి కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. 'పరమేశ్వరుడి గొప్ప భక్తుడి కథ తెలుసుకునేందుకు సిద్ధం అవ్వండి" అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
మహాకవి ధూర్జటి రాసిన శ్రీ కాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని ఈ కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కించారు. మహాభారత’ సిరీస్‌ను రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని డెరెక్ట్ చేశారు. భారీ బడ్జెట్‌తో మోహన్ బాబు నిర్మిస్తున్నారు. విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ప్రభాస్ గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. మోహన్ బాబు, శరత్ కుమార్, మధు బాల, ప్రీతి ముకుందన్, మోహనల్ లాల్, శివ రాజ్ కుమార్ అక్షయ్ కుమార్ సహా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విష్ణు తనయుడు అవ్రామ్ ఈ చిత్రంతో అరంగేట్రం చేయనున్నారు. బాల తిన్నడుగా అతడు కనిపించనున్నాడు.