తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

దుమ్మురేపుతున్న 'కల్కి' బుకింగ్స్​ - 5 లక్షలకు పైగా టికెట్లు సోల్డ్ ఔట్​! - kalki 2898AD Bookings - KALKI 2898AD BOOKINGS

kalki 2898AD Bookings : 'కల్కి' 2898 ఏడీ చిత్రం బుకింగ్స్‌లో దుమ్మురేపుతోంది. ఇంకా రిలీజ్​కు రెండు రోజులు మిగిలి ఉండగానే ఇండియాలో అడ్వాన్స్​ బుకింగ్స్​లో దాదాపు 5 లక్షల టికెట్లు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు స్టోరీలో

source ETV Bharat
kalki 2898AD Bookings (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 25, 2024, 12:11 PM IST

Updated : Jun 25, 2024, 12:23 PM IST

kalki 2898 AD Bookings : 'కల్కి' 2898 ఏడీ చిత్రం బుకింగ్స్‌లో అదరగొడుతోంది. సాధారణంగానే ప్రభాస్ సినిమా అంటే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు అంతకుమించి అనేలా ఎపిక్​ సైన్స్​ ఫిక్షన్​ కల్కి బుకింగ్స్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో కనిపించే పోస్ట్​ల ప్రకారం ఒక్క గంటలోనే 60 వేల టికెట్లు బుక్ అయినట్లుగా ఫ్యాన్స్ చెబుతున్నారు. ఓ పోస్ట్ ప్రకారం - హైదరాబాద్‌లో టాప్ 5 అడ్వాన్స్ డే1 గ్రాస్‌లో కల్కి టాప్​లో నిలిచింది. ఇప్పటివరకూ కేవలం బుకింగ్స్‌లోనే హైదరాబాద్‌లో కల్కి రూ.14.5 కోట్లు వసూలు చేసిందట. అది కూడా ఇంకా రిలీజ్​కు రెండు రోజుల సమయం ఉండగానే. తర్వాతి స్థానంలో రూ.12.5 కోట్లతో సలార్ ఉంది. ఆ తర్వాత రూ.10.5 కోట్లతో ఆర్ఆర్ఆర్, రూ.9.5కోట్లతో ఆదిపురుష్​ ఉంది. దీంతో రిలీజ్​కు ముందు కల్కి రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని ప్రభాస్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

ఇక Sacnilk డేటా ప్రకారం - ఇప్పటివరకు అడ్వాన్స్​ బుకింగ్స్​లో మొత్తంగా దాదాపు 5 లక్షలకు పైగా టికెట్లు అమ్మడుపోయాయని తెలిసింది. 15.92 కోట్లు గ్రాస్​ కలెక్ట్ చేసిందట. తెలుగు వెర్షన్​కు 4.5 లక్షలు టికెట్లు(రూ.14.46 కోట్లు), తమిళ వెర్షన్​కు 8, 934 టికెట్లు(రూ.14.75 లక్షలు), హిందీ వెర్షన్​కు 37,952 టికెట్లు(రూ.1.15 కోట్లు), మలయాళ వెర్షన్​కు 1,126 టికెట్లు (రూ.1.9 లక్షలు), కన్నడ వెర్షన్​కు 182 టికెట్లు(రూ.42,300) అమ్ముడుపోయాయట.

ఓవర్సీస్​లో ప్రభాస్ క్రేజ్​ - అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రభాస్​కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో అక్కడ కూడా కల్కి బుకింగ్స్​ భారీగానే జరుగుతున్నాయి. నార్త్ అమెరికాలో ఇప్పటికే లక్ష 25 వేల టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలిసింది.

కాగా, నాగ్​ అశ్విన్​ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ స్టోరీనే కల్కి. దీపిక పదుకొణె, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దిశా పటానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర మొదటి భాగం జూన్‌ 27న రిలీజ్ కానుంది. దీని కోసం అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ప్రభాస్ కాలికి గాయం ఇంకా తగ్గలేదా? - వీడియో వైరల్! - Prabhas Kalki 2898 AD

'కల్కి' టికెట్ రేట్లు పెంపునకు AP ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ - ఎంత పెరిగాయంటే?

Last Updated : Jun 25, 2024, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details