తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రభాస్ బర్త్​ డే - ఆ రోజు ఫ్యాన్స్​కు 6 సర్​ప్రైజ్​లు! - PRABHAS RERELEASE MOVIES

ప్రభాస్ పుట్టినరోజు(అక్టోబర్ 23)న రీరిలీజ్​ కానున్న డార్లింగ్ సినిమాలివే!

Prabhas Happy Birthday Rerelease Movies
Prabhas Happy Birthday Rerelease Movies (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2024, 9:22 AM IST

Prabhas Happy Birthday Rerelease Movies : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23. అయితే గత కొంత కాలంగా హీరోల పుట్టినరోజులకు వారికి సంబంధించిన పాత చిత్రాలను రీరిలీజ్ చేస్తున్నారు. అలా ఈ సారి కూడా డార్లింగ్ బర్త్​ డేకు కూడా ప్రభాస్ పాత్ర సినిమాలను మళ్లీ విడుదల చేయనున్నారు. కానీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ చిత్రాలేంటో తెలుసుకుందాం.

ప్రభాస్ ఈ అక్టోబర్ 23న తన 45వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నారు. బాహుబలి 2 తర్వాత వరుస ఫ్లాప్​లను అందుకున్న ఆయన సలార్, కల్కి 2898 ఏడీ చిత్రాలతో భారీ సక్సెస్​లను అందుకున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్​ రెట్టింపు ఉత్సాహంతో ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోనున్నారు. ఇందులో భాగంగానే ఏకంగా ఆరు సినిమాలు థియేటర్లలో రీరిలీజ్​కు రెడీ అవుతున్నాయి.

ఈశ్వర్ - ప్రభాస్ హీరోగా పరిచయం అయిన చిత్రం ఈశ్వర్. శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్​గా నటించింది. అందుకే ఈ చిత్రాన్ని కూడా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా థియేటర్లలో మళ్లీ విడుదల చేస్తున్నారు.

సలార్ పార్ట్ 1 - సలార్ పార్ట్ 1 గతేడాది థియేటర్లలో రిలీజై భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమాతోనే అప్పటి వరకు ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్​ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రీసెంట్​గానే ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ హిందీ టీవీ ప్రీమియర్‌లోనూ సత్తా చాటి రికార్డును కైవసం చేసుకుంది. ఇప్పుడు రీరిలీజ్​కు సిద్ధమవుతోంది. త్వరలోనే సలార్ 2 శౌర్యాంగపర్వం సెట్స్​పైకి వెళ్లనుంది.

రెబల్ - ప్రభాస్ నుంచి వచ్చిన మరో సూపర్ ఫిల్మ్ రెబల్. కానీ ఇది బాక్సాఫీస్ దగ్గర మిక్స్​డ్​ రివ్యూస్​ను అందుకుంది. యంగ్ రెబల్ స్టార్​గా పరిశ్రమకు వచ్చిన ప్రభాస్ ఈ చిత్రంతోనే రెబల్​గా మారిపోయారు. ఈ చిత్రం ఇప్పుడు రీరిలీజ్ ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.

మిర్చి - ప్రభాస్ స్టార్​ డమ్​ను మరింత పెంచిన సినిమా మిర్చి. ఈ యాక్షన్ సినిమాకు అప్పట్లో ఈ సినిమా మంచి రికార్డులను అందుకుంది. ఇది కూడా డార్లింగ్ బర్త్​ డేకు రానుంది. ఇందులో అనుష్క హీరోయిన్​గా నటించింది.

ఛత్రపతి - ప్రభాస్, రాజమౌళి కాంబోలో విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇందులో ప్రభాస్​ యాక్షన్, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్​తో పాటు సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం కూడా మళ్లీ రానుంది.

మిస్టర్ పర్ఫెక్ట్ - ఈ ఫ్యామిలీ డ్రామాలో ప్రభాస్​ లుక్స్​, డ్రెస్ స్టైల్​ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంతో ఫ్యామిలీ ఆడియెన్స్​కు ఆయన బాగా దగ్గరయ్యారు. కాజల్, తాప్సీ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలోని పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి. ఇది కూడా రీరిలీజ్ కాబోతుంది.

PVCUలో ప్రభాస్ సినిమా - ప్రశాంత్ వర్మతో మూవీకి డార్లింగ్ ఓకే!

'రోలెక్స్'​కు ఆ సినిమాతో కనెక్షన్స్​ - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సూర్య

ABOUT THE AUTHOR

...view details