తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఈటీవీ విన్ స్పెషల్ షోలో బర్త్​డే బాయ్ ప్రభాస్ - ఈ కోడ్ ఉపయోగిస్తే డిస్కౌంట్​తో చూసేయొచ్చు! - NAA UCHVASAM KAVANAM PROGRAM

ప్రభాస్ బర్త్​డే స్పెషల్ - ఈటీవీ విన్​లో ఈ స్పెషల్ ప్రోగ్రామ్ చూశారా?

Prabhas Naa Uchvasam Kavanam Program
Prabhas (ETV Win)

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2024, 10:43 AM IST

Prabhas ETV Win Special Programme : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్​డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశవిదేశాల్లో ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్, సెలబ్రిటీలు ఆయనకు నెట్టింట విషెస్ చెబుతూ సంబరాలు చేసుకుంటున్నారు. మరికొందరేమో తన అప్​కమింగ్ మూవీస్​కు సంబంధించిన స్పెషల్ అప్​డేట్స్ కోసం తెగ ఎదురుచూస్తన్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ఛానెల్ ఈటీవీ విన్ కూడా ప్రభాస్ ఫ్యాన్స్​ను తమ కంటెంట్​తో సర్​ప్రైజ్ చేసింది. ఆయనకు సంబంధించిన ఓ ప్రోగ్రామ్​ను బర్త్​డే స్పెషల్​గా ఓటీటీలో రిలీజ్ చేసింది.

దివంగత లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రిని గుర్తు చేసుకుంటూ ఇటీవలె ఈటీవీ విన్ ఓ స్పెషల్ ప్రోగ్రామ్​ను ఏర్పాటు చేసింది. 'నా ఉచ్ఛ్వాసం కవనం' అనే పేరిట రన్ అవుతున్న ఈ షోలో సిరివెన్నెల సాహిత్యం గురించి అలాగే ఆయన తమకున్న అనుబంధం గురించి ప్రముఖులు పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటుంటారు. అలా ఈ సారి ఈ వేదికకు ప్రభాస్ అతిథిగా వచ్చి సందడి చేశారు.

"సాహిత్యం అందం అర్థంతో పాటు, రాసేవాళ్లకు ఉన్న విలువ ఏంటో తెలియజెప్పిన వ్యక్తి 'సిరివెన్నెల' అంటూ ప్రభాస్‌ సిరివెన్నెలను కొనియాడారు. అంతేకాకుండా తన సినిమాల్లోని పలు సాంగ్స్​కు ఆయన రాసిన లిరిక్స్ గురించి మాట్లాడారు.

తాజాగా విడుదలైన ప్రోమోకు నెట్టింట విశేష స్పందన లభించింది. ప్రస్తుతం ఇది ఈటీవీ విన్​లో స్ట్రీమ్ అవుతుండగా, ప్రేక్షకులు, అభిమానులు దాన్ని సబ్​స్క్రైబ్ చేసుకుని చూడొచ్చు. అంతేకాకుండా ఓ ప్రత్యేకమైన కోడ్ (REBEL 100) ఉపయోగించుకుని ప్రీమియమ్ అమౌంట్​లో డిస్కౌంట్​ కూడా పొందవచ్చని తాజా ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఇదే ఎపిసోడ్​ను ఆదివారం (అక్టోబర్ 27) ఉదయం 9 గంటలకు ఈటీవీలో ఈ కార్యక్రమం ప్రసారం చేయనున్నారు.

ఈటీవీ విన్​లో ప్రభాస్ సినిమాలు!
ఇక ఈటీవీ విన్​లో ఈ ప్రోగ్రామే కాకుండా ప్రభాస్ నటించిన పలు సినిమాలు కూడా ఉన్నాయి. బుజ్జిగాడు, రాఘవేంద్ర లాంటి సినిమాలను ఈటీవీ విన్ ప్రస్తుతం సబ్​స్క్రైబర్ల కోసం అందుబాటులో ఉంచింది.

'ఆయన పాటలు మనుషులకు నేస్తాలు - అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్' - Nagarjuna About Sirivennela

'ఆ కటౌట్​ చూసి అన్ని నమ్మేయాలి డూడ్​!' - డార్లింగ్​కు చిరు స్పెషల్ విషెస్​!

ABOUT THE AUTHOR

...view details