తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఒకేసారి 2 OTTల్లో భయపెడుతున్న హారర్ ఫిల్మ్​ - మీరు చూడగలరా? - ఒకేసారి 2 ఓటీటీలోకి పిండం

Pindam Movie OTT Release : తెలుగు హారర్ ఫిల్మ్​ 'పిండం' ఒకేసారి రెండు ఓటీటీల్లోకి వచ్చేసింది. ఆ వివరాలు.

ఒకేసారి 2 OTTల్లో భయపెడుతున్న హారర్ ఫిల్మ్​ - ఎందులో చూడాలంటే?
ఒకేసారి 2 OTTల్లో భయపెడుతున్న హారర్ ఫిల్మ్​ - ఎందులో చూడాలంటే?

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 10:55 AM IST

Pindam Movie OTT Release : హారర్ సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుంది. స్టార్ కాస్ట్​తో సంబంధం లేకుండానే ఈ జానర్ మూవీస్​ను చూసేందుకు ఆడియెన్స్​ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ మధ్య మసూద, మా ఊరి పొలిమేర వంటి సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. రీసెంట్​గా ఇదే తరహాలో వచ్చిన మరో హారర్ చిత్రం కూడా మంచి టాక్​ను అందుకుంది. అదే 'పిండం'. 'ది స్కేరియ‌స్ట్ ఫిలిం ఎవ‌ర్' ఉప‌శీర్షిక‌.

గతేడాది డిసెంబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం టీజర్‌, ట్రైలర్‌తోనే మంచి అంచనాలను క్రియేట్ చేసింది. అనంతరం థియేటర్లలోకి వచ్చి ఆడియెన్స్​ను భయపెట్టింది! దీంతో ఓటీటీ రిలీజ్‌ కోసం ఎంతో ఇంట్రెస్ట్​గా ఎదురుచూశారు మూవీ లవర్స్​. ఇప్పుడు వారి ఎదురుచూపులకు తెరదించుతూ ఒకేసారి రెండు ఓటీటీల్లోకి వచ్చేసిందీ చిత్రం. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌, ఆహాలోకి అందుబాటులోకి వచ్చింది.

సాధారణంగా హార‌ర్ మూవీస్​ ఎక్కువ‌గా కామెడీ మేళ‌వింపుగానే సాగుతుంటాయి. కానీ అలా కామెడీ ఇత‌ర‌త్రా అంశాలతో సంబంధం లేకుండా కేవ‌లం భ‌యమే ప్ర‌ధానంగా సాగ‌డ‌మే 'పిండం' చిత్రం ప్ర‌త్యేక‌త‌. ఈ చిత్రాన్ని ప్రస్తుత కాలంతో పాటు 1990, 1930.. ఇలా మూడు కాలక్రమాలలో సాగేట్టుగా చూపించారు. ఇక సినిమాలో హీరో శ్రీరామ్‌, ఖుషి రవితో పాటు ఈశ్వరి రావు, రవి వర్మ, అవసరాల శ్రీనివాస్‌ ఇతర పాత్రల్లో కనిపించి మెప్పించారు. సాయికిరణ్‌ దైదా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యశ్వంత్‌ దగ్గుమాటి నిర్మాతగా వ్యవహించారు. కృష్ణ సౌరభ్ సూరంపల్లి సంగీతం అందించారు.

ఎవరెలా చేశారంటే? : శ్రీరామ్‌, ఖుషి ర‌వి తమ పాత్రలలో ఒదిగిపోయారు. అన్న‌మ్మ‌గా ఈశ్వ‌రీరావు పాత్ర సినిమాకే ప్రాముఖ్యం. తాంత్రిక శ‌క్తులున్న మ‌హిళ‌గా ఈశ్వ‌రీరావు నటించిన తీరు మెప్పిస్తుంది. కెమెరా, సంగీతం విభాగాలు మంచి ప‌నితీరును ప్ర‌ద‌ర్శించాయి. సౌండ్స్​తోనే భ‌య‌పెట్టాడు సంగీత ద‌ర్శ‌కుడు.విష్ణు నాయ‌ర్. ద‌ర్శ‌కుడు భ‌య‌పెట్టే స‌న్నివేశాల్ని బాగా డిజైన్ చేశాడు. మరి మీరు థియేటర్​లో ఈ సినిమా మిస్ అయితే ఈ వీకెండ్​లో చూసేయండి.

ఓటీటీలోకి వచ్చేసిన అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ - స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఆమిర్ ఖాన్ మాజీ భార్యకు సందీప్​ వంగా కౌంటర్​

ABOUT THE AUTHOR

...view details