Padmavibhushan Chiranjeevi : నటన అంటే కమల్. స్టైల్ అంటే రజనీ. ఈ రెండూ ఉన్న కథానాయకుడు చిరంజీవి! ఆయన డ్యాన్స్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆయన యాక్షన్ ఆడియెన్స్‌ను థియేటర్లకు మళ్లీ మళ్లీ పరుగులు పెట్టించింది. ఆయన విలక్షణమైన నటన ఎన్నో పాత్రలకు, కథలకు జీవం పోసింది. ఆయన స్టైల్, మేనరిజమ్ 'మాస్' అనే మాటకు సరికొత్త నిర్వచనం చెప్పింది. అలా ఈ లక్షణాలే ఆయన్ను అగ్రపీఠంపై కూర్చోబెట్టాయి. నేడు దేశంలోని రెండు అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌ను వరించేలా చేశాయి.
అయితే మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు కెరీర్లో ఎన్నో చిత్రాల్లో నటించారు. దాదాపు 150కు పైగా చిత్రాల్లో నటించి కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్నారు. మరి తాను నటించిన ఈ చిత్రాల్లో చిరుకు బాగా నచ్చిన పది చిత్రాలేంటో తెలుసా? వాటి గురించే ఈ కథనం..
1. పున్నమినాగు
2. చట్టానికి కళ్ళు లేవు
3. అభిలాష
4. ఖైదీ
5. అడవి దొంగ
6. స్వయంకృషి
7. రుద్రవీణ
8. జగదేకవీరుడు అతిలోకసుందరి
9. ఘరానా మొగుడు
10. ఠాగూర్
సినిమాలకు గ్యాప్ - 'ఖైదీ 150'తో టాప్ - అప్పటికీ ఇప్పటికీ 'మెగా'స్టారే
చిరంజీవి బెస్ట్ మూవీస్ : ఇకపోతే చిరంజీవి నటించిన మొత్తం 150 చిత్రాల్లో Top 10, Top 25 అలా ఎంపిక చేయడం కష్ట సాధ్యమైన విషయం. అందుకే 1978 నుంచి ఇప్పటివరకు చిరంజీవి నటించిన చిత్రాల్లో అత్యుత్తమమైన, అత్యంత ప్రజాదరణ పొందినవి, అలాగే ప్రేక్షకాభిమానులే కాక, విమర్శకులు సైతం అభిమానించిన చిత్రాలేంటో చూసేద్దాం.
- 1978 ప్రాణం ఖరీదు, మనవూరి పాండవులు
- 1979 కుక్క కాటుకు చెప్పుదెబ్బ, ఐ లవ్ యు, పునాదిరాళ్ళు, ఇది కథ కాదు, కోతలరాయుడు
- 1980 పున్నమినాగు, నకిలీమనిషి, మొగుడు కావాలి, మోసగాడు
- 1981 న్యాయం కావాలి, 47 రోజులు, చట్టానికి కళ్ళు లేవు, కిరాయి రౌడీలు
- 1982 ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్ణయ్య, శుభలేఖ, మంచుపల్లకి, పట్నం వచ్చిన పతివ్రతలు
- 1983 అభిలాష, మగమహారాజు, ఖైదీ, మంత్రిగారి వియ్యంకుడు, పల్లెటూరి మొనగాడు
- 1984 గూండా, ఛాలెంజ్
- 1985 అడవి దొంగ, చట్టంతో పోరాటం, దొంగ, విజేత, జ్వాల, రక్తసింధూరం
- 1986 చంటబ్బాయి, రాక్షసుడు, కొండవీటి రాజా, మగధీరుడు
- 1987 దొంగ మొగుడు, ఆరాధన, పసివాడి ప్రాణం, స్వయంకృషి, చక్రవర్తి
- 1988 రుద్రవీణ, యముడికి మొగుడు, మంచి దొంగ, మరణమృదంగం, త్రినేత్రుడు, ఖైదీ నెం:786
- 1989 అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, స్టేట్ రౌడీ
- 1990 కొండవీటి దొంగ, జగదేకవీరుడు అతిలోకసుందరి, కొదమసింహం, ప్రతిబంధ్(హిందీ)
చిరు సినిమాల్లోని ఈ ఫేమస్ డైలాగ్స్ మీకు తెలుసా ?
- 1991 గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు
- 1992 ఘరానా మొగుడు, అజ్కా గూండారాజ్ (హిందీ), ఆపద్భాంధవుడు
- 1993 ముఠామేస్త్రి
- 1994 ముగ్గురు మొనగాళ్ళు
- 1995 అల్లుడా మజాకా
- 1996 సిపాయి (కన్నడం)
- 1997 హిట్లర్, మాస్టర్
- 1998 బావగారూ బాగున్నారా, చూడాలని వుంది
- 1999 స్నేహం కోసం
- 2000 అన్నయ్య
- 2001 శ్రీ మంజునాథ, డాడీ
- 2002 ఇంద్ర
- 2003 ఠాగూర్
- 2004 శంకర్‌దాదా MBBS
- 2023 వాల్తేరు వీరయ్య
'చిరంజీవిని చూస్తే నాకు ఈర్ష్య' - మెగాస్టార్ గురించి ఎవరెవరు ఏం చెప్పారంటే?
చిరంజీవికి పద్మ విభూషణ్ - అల్లు అర్జున్, రామ్‌చరణ్ ఏమన్నారంటే?