OTT Movies And Series Releasing This Week :ఆగస్టు మొత్తం వరుస సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. చిన్న, పెద్ద ఇలా అన్ని బడ్జెట్ సినిమాలు తమ సత్తా చాటి ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు అదే జోష్‌తో సెప్టెంబర్ కూడా రానుంది. ఈ నేపథ్యంలో మొదటివారంలో పలు సినిమాలు థియేటర్లలో అలాగే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో సందడి చేసేందుకు సిద్ధమైన సివిమాలు, సిరీస్‌లు ఇవే.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'. స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
టాలీవుడ్ స్టార్ హీరో రానా నిర్మాణంలో రూపొందిన మూవీ '35 చిన్న కథ కాదు'.యంగ్ డైరెక్టర్ నందకిశోర్ ఇమాని తెరక్కెక్కించిన ఈ చిత్రం తెలుగు, తమిళం అలాగే మలయాళంలో సెప్టెంబర్ 6న విడుదల కానుంది.
యంగ్ హీరో సుహాస్ లీడ్ రోల్లో సందీప్‌రెడ్డి బండ్ల తెరకెక్కించిన చిత్రం 'జనక అయితే గనక'. ఇటీవలే వచ్చిన ట్రైలర్‌తో ప్రేక్షకులను ఆద్యంతం నవ్వించిన ఈ చిత్రం సెప్టెంబరు 7న థియేటర్లలో రిలీజవ్వనుంది.
ఇక ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీగా ఉన్న సినిమాలు, సిరీస్‌లు ఇవే :
నెట్‌ఫ్లిక్స్
బ్యాడ్‌బాయ్స్: రైడ్ ఆర్ డై (ఇంగ్లీష్) సెప్టెంబరు 6
అపోలో 13: సర్వైవల్ (డాక్యుమెంటరీ) సెప్టెంబరు 05
రెబల్ రిడ్జ్ (ఇంగ్లీష్) సెప్టెంబరు 06
ది పర్‌ఫెక్ట్ కపుల్ (ఇంగ్లీష్) సెప్టెంబరు 5
డిస్నీ+హాట్‌స్టార్
కిల్ (హిందీ) సెప్టెంబరు 6
బ్రిక్ టూన్స్ (ఇంగ్లీష్) సెప్టెంబరు 4