తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వీకెండ్ స్పెషల్​ - టాప్ 10 ట్రెండింగ్​ సిరీస్​ ఇవే! మీరేం చూస్తారు? - Top 10 OTT Webseries - TOP 10 OTT WEBSERIES

Top 10 OTT Web Series : వీకెండ్ వచ్చేసింది కదా. అందుకే ఓటీటీలో టాప్ 10లో ట్రెండింగ్​లో అవుతున్న సిరీస్​లను మీ ముందుకు తీసుకొచ్చాం. అవేంటంటే?

.
.

By ETV Bharat Telugu Team

Published : Apr 20, 2024, 3:18 PM IST

Top 10 OTT Web Series :వీకెండ్​ రాగానే ఓటీటీ ప్రియులంతా ఇంట్లోనే ఎంచక్కా సినిమా, సిరీస్​లను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అందుకు తగ్గట్టే ఓటీటీ ప్లాట్​ఫామ్స్​ కూడా సరికొత్త ఆసక్తికరమైన కంటెంట్​ను స్ట్రీమింగ్​కు వదులుతుంటాయి. అయితే తాజాగా ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ మూవీ లవర్స్​ కోసం ఈ వారంలో ఓటీటీలో టాప్​ 10 ట్రెండింగ్ అయిన సిరీస్​ల లిస్ట్​ను మీ ముందుకు తీసుకొచ్చింది.

ఏప్రిల్​ 12 నుంచి 18వ వరకు ట్రెండింగ్​లో ఉన్న సిరీస్ వివరాలను తెలిపింది.​ ఇందులో అమర్ సింగ్ చమ్కిలా తొలి స్థానంలో నిలిచింది. ఇంతియాజ్ అలీ డైరెక్ట్​ చేసిన ఈ సిరీస్​లో దిల్జీజ్ దోసాంజ్, పరిణీతి చోప్రా, రాహుల్ మిత్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 12న నెట్‌ఫ్లిక్స్​లో విడుదలైంది. రియల్ లైఫ్ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు.

ఇక రెండో స్థానంలో ఇన్​స్పెక్టర్ రిషి నిలిచింది.క్రైమ్ థిల్లర్​గా వచ్చిన ఈ సిరీస్​లో నవీన్ చంద్ర హీరోగా నటించారు. మార్చి 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. టాప్ 3లో రజత్ కపూర్, వివేక్ గోంబర్, చందన్ రాయ్ సన్యాల్, అమృతా ఖన్విల్కర్, ప్రీతికా చావ్లా నటించిన లూటేరే వెబ్ సిరీస్ ఉంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.

టాప్ 4లో క్రైమ్ డ్రామా ఫాల్ ఔట్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఐదో స్థానంలో మెరీ ఫ్యామిలీ సీజన్ 3 అమెజాన్ మిని టీవీ వేదికగా ఏప్రిల్ 4 నుంచి అందుబాటులో ఉంది. ఇక టాప్​ 6 నెట్​ఫ్లిక్స్​లో మార్చి 30నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో కొనసాగుతోంది.

ఏడో స్థానంలో నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న బాడీ ప్రాబ్లమ్ నిలిచింది. ఈ సిరీస్​ కంటెంట్​ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. టాప్ 8లో అదృశ్యం ది ఇన్విజిబుల్ హీరోస్ కొనసాగుతోంది. స్వరూప ఘోష్, దివ్యాంక త్రిపాఠి, ఇజాజ్ ఖాన్, తరుణ్ ఆనంద్​లు ప్రధాన పాత్రలో నటించారు.

తొమ్మిదో స్థానంలో మహారాణి సీజన్ 3 స్ట్రీమింగ్ అవుతోంది. సౌరభ్ బేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్ వేదికగా అందుబాటులో ఉంది. పదో స్థానంలో షో టైమ్ అనే వెబ్ సిరీస్ ట్రెండింగ్ అవుతోంది. అర్చిత్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో ఇమ్రాన్ హష్మి, మౌనీ రాయ్, నసీరుద్దిన్, రాజీవ్ ఖండేల్వాల్, మహిమ ప్రధాన పాత్రల్లో నటించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఇది అందుబాటులో ఉంది.

200 మిలియన్​ ప్లస్​ - నెట్టింట కుర్చి మడతపెట్టి సాంగ్ ర్యాంపేజ్​! - Kurchi Madatha Petti Song

రూట్ మార్చిన టాలీవుడ్- అందరి చూపు ఫాంటసీ వైపు! - Socio Fantasy Movies In Telugu

ABOUT THE AUTHOR

...view details