Operation Valentine Varuntej Nagababu Controversy Comments : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కింది. శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారు. మానుషి చిల్లర్ హీరోయిన్గా నటించింది. నవదీప్,మిర్ సర్వార్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సారి ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలని వరుణ్ తేజ్ సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్‌గా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, తన తండ్రి నాగబాబు చీఫ్ గెస్ట్లుగా వచ్చారు. అయిత ఈవెంట్లో వరుణ్ తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి. ఇద్దరు హీరోల అభిమానుల మధ్య గొడవ రేగింది.
ఈ ఈవెంట్లో ఆరడుగులున్న తన వారసుడిని ప్రశంసించే క్రమంలో ఐదడుగులు ఉన్న వారు కూడా పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేస్తున్నారంటూ నాగబాబు వెటకారంగా మాట్లాడారు. "కొన్ని కొన్ని సార్లు కొన్ని క్యారెక్టర్లు క్యారీ చేయాలంటే ఒక 5 అడుగుల 3 అంగుళాలు ఉన్నవాడు, నేను ఫిట్ పోలీసాఫీసర్ అంటే కామెడీగా అనిపిస్తుంది. నువ్వు కాదులేరా బాబూ అనిపిస్తుంది." అని ఫ్లోలో అనేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నెట్టింట్లో రామ్‌చరణ్ - ఎన్టీఆర్ అభిమానుల గోల చేయడం మొదలెట్టేశారు. జంజీర్లో పోలీస్ అధికారిగా కనిపించిన రామ్‌చరణ్‌ను అన్నారని అపోజిట్ ఫ్యాన్స్ అంటే, బాద్ షా సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఎన్టీఆర్‌ను అన్నారని అవతలి పక్క అభిమానులు అంటున్నారు.