Operation Valentine Varun Tej Child Artist Movie :మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా హీరో ట్యాగ్ లైన్‌తో పెదనాన్న చిరంజీవి ఆశీస్సులతో నాగబాబు తనయుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ముకుంద చిత్రంతో హీరోగా పరిచయమైన ఆయన ఆ తర్వా కంచెతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఫిదాతో తొలి కమర్షియల్ హిట్‌ను అందుకున్నారు. నటించిన తొలి సినిమానే యావరేజ్‌గా ఆడినప్పటికీ తన సినిమాల సెలక్షన్‌తో మెగా ఫ్యాన్స్ చూపును తన వైపునకు తిప్పుకున్నారు. ఇక గద్దల కొండ గణేశ్‌తో భారీ సక్సెస్‌ను అందుకుని మెగా వారసుడు అనిపించుకున్నారు.
అయితే మెగా హీరోల్లో అల్లు అర్జున్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ లాంటి హీరోలు తమ చిన్నప్పుడే సినిమాల్లో మెరిశారు. అల్లు అర్జున్ చిరంజీవి విజేతతో పాటు మరో చిత్రంలో నటిస్తే, వైష్ణవ్ తేజ్ జానీ, శంకర్ దాదా mbbs, అందరివాడు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించారు. ఇక రామ్ చరణ్ చిన్నప్పుడు ఎప్పుడూ కనిపించలేదు. అయితే వరుణ్ తేజ్ ఒక సినిమాలో బాలనటుడిగా కనిపించారని మీకు తెలుసా? చాలా మందికి ఈ విషయం తెలియదు.
వరుణ్ - ప్రముఖ నటి జయసుధతో పాటు నాగబాబు, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన హ్యాండ్సప్ చిత్రంలో ఉన్నారు. ప్రముఖ దర్శకుడు శివ నాగేశ్వర రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. క్లైమాక్స్‌లో ప్రముఖ నటుడు సోనూసూద్ కూడా చిన్న విలన్ పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రంతోనే ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్‌లోనే వరుణ్ తేజ్ కూడా చిన్న పాత్రలో కనిపిస్తారు. చిరుతో కలిసి ఆయనకు రెండు నిమిషాల సీన్ ఉంటుంది. అయితే ఈ హ్యాండ్సప్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడలేదు.