తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఓం భీమ్ బుష్ - ఇప్పుడు కుర్రాళ్ల చూపంతా ఈ ముద్దుగుమ్మపైనే! - Ayesha Khan - AYESHA KHAN

Om bhim bhush Heroine Ayesha Khan : అయేషా ఖాన్ ఈ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక్కసారిగా ట్రెండింగ్​లోకి వచ్చింది. తాజాగా రిలీజైన ఓం భీమ్ బుష్ మూవీలో నటించిన ఈ అమ్మడు తన అందం, అభియనంతో కర్రాళ్లను కట్టిపడేసింది. ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం.

ఓం భీమ్  బుష్ - ఇప్పుడు కుర్రాళ్ల చూపంతా ఈ ముద్దుగుమ్మపైనే!
ఓం భీమ్ బుష్ - ఇప్పుడు కుర్రాళ్ల చూపంతా ఈ ముద్దుగుమ్మపైనే!

By ETV Bharat Telugu Team

Published : Mar 24, 2024, 2:50 PM IST

Om bhim bhush Heroine Ayesha Khan :సమయం ఎవరిని ఎప్పుడు ఎక్కడకు తీసుకెళ్తుందో ఎవరికీ తెలియదు. సినీ ఇండస్ట్రీలో అయితే ఎవరు ఎప్పుడు స్టార్ అవుతారో చెప్పలేం. కొంతమందికి ఎన్నేళ్లు కష్టపడినా రాని గుర్తింపు, మరి కొంతమందికి రాత్రిరాత్రే ఓవర్ నైట్​గా గుర్తింపు తీసుకొస్తుంది. ఇలా స్టార్ స్టేటస్​తో సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ట్రెండింగ్​లో ఉంటారో కూడా చెప్పలేం. ఇప్పుడు బాలీవుడ్ భామ అయేషా ఖాన్ రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె గురించి వివరాల్లోకి వెళితే.

అయేషా ఖాన్ ప్రస్తుతం టాలీవుడ్​లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. హిందీ బిగ్ బాస్ ద్వారా స్టార్ డమ్ ప్రయాణం షురూ అయింది. ఇన్ స్టాగ్రామ్​లో ఈమె డ్యాన్స్ రీల్స్ ఈ అమ్మడిని స్పాట్ లైట్ లోకి నడిపించాయి. ఈ మధ్యే రిలీజైన ఓం భీమ్ బుష్ మూవీ విడుదలతో అయేషా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో తన గ్లామరస్ రోల్​కు మంచి మార్కులు వచ్చాయి. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ ట్రెండింగ్ ఐకాన్​గా నిలిచింది. స్క్రీన్ పై తన గ్లామర్​ను ప్రదర్శించడం ద్వారా అయేషా కుర్రాలను బాగా ఆకర్షించింది. ఇప్పటికే అయేషా గ్లామరస్ ఫొటోలు, ఆకర్షణీయమైన డ్యాన్స్ వీడియోలు సామాజిక మాద్యమాల్లో తెగ వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం ఈ చిన్నది వరుస సినిమాలకు సైన్ చేస్తోందని తెలుస్తోంది. విశ్వక్ సేస్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో అయేషా, స్పెషల్ సాంగ్ చేసింది. తాజాగా ఈ సాంగ్​కు సంబంధించిన పోస్టర్​ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. మోత అంటూ సాగే ఈ సాంగ్ హోలీ రోజు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ పోస్టర్​లో అయేషా అప్సరసలా కనిపించింది. ఈసాంగ్ హిట్ అయితే ఈ అమ్మడును ఆపడం కొద్ది రోజులు ఎవరితరం కాదేమో. ఇంకా వెంకీ అట్లూరీ డైరెక్షన్​లో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్​లోనూ హీరోయిన్​గా లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే ఈ పిల్ల జోరు మామూలుగా లేదు. రానున్న రోజుల్లో టాలీవుడ్​లో ఏ రేంజ్​లో ఎదుగుతుందో చూడాల్సిందే.

ABOUT THE AUTHOR

...view details