Devara Movie Janhvi Kapoor Saree Pics : బాలీవుడ్ భామ, హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తన కవ్వించే అందచందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తూ ఉంటుంది.
అయితే ప్రస్తుతం జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన 'దేవర'లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పుడీ దేవర సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా అంతా దేవర నామస్మరణే కనిపిస్తోంది.
రిలీజ్ డేట్ దగ్గర పడడంతో దేవర మూవీ టీమ్ కూడా ప్రమోషన్స్‌లో ఫుల్ జోరు పెంచింది. ఇప్పటికే ముంబయిలో ఫుల్ స్వింగ్‌లో ఈ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంటున్నారు.
ఇదే సమయంలో జాన్వీ కపూర్ తన అందాలతోనూ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా చీర కట్టులో అదిరే ఫొటోలను షేర్ చేసింది. పింక్ కలర్ శారీలో అందాలను ఆరబోస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ఈ పిక్స్‌ను చూసి ఫిదా అయిపోతున్నారు. వాటిని తెగ షేర్ చేస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.
Devara Movie Release Date : కాగా, విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత నేపథ్య కథతో దేవర సినిమా తెరకెక్కింది. పక్కా యాక్షన్ డ్రామాగా ముస్తాబైంది. కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రెండు భాగాలుగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీసేల్ టికెట్ బుకింగ్స్‌లో వన్ మిలియన్ సేల్ మార్క్‌ను టచ్ చేసింది.
'దేవర' రోర్ - ట్రైలర్ రాకుండానే వన్ మిలియన్ టికెట్స్ సోల్డ్! - ఆ ఘనత సాధించిన తొలి సినిమాగా! - Devara Movie USA Pre Sales
'రామాయణ'లో రణ్‌బీర్ ద్విపాత్రాభినయం - ఆ పాత్రకు అమితాబ్ వాయిస్ ఓవర్! - Ramayan Ranbir Kapoor