Devara Chuttamalle Song : దర్శకుడు కొరటాల శివ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి చేస్తున్న 'దేవర' షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగుతాయి. మొదటి భాగం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుండటం విశేషం.
అయితే రీసెంట్గా ఈ మూవీ నుంచి విడుదలైన 'చుట్టమల్లే'కు అదిరే రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌ను దక్కించుకుంది. అలానే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సాంగ్‌కు సంబంధించిన వీడియోలు, రీల్స్ ఎక్కువుగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ పాటకు సంబంధించిన ఓ ఫ్యాన్ మేడ్ వీడియో తెగ వైరల్ అవుతూ నెటిజన్లను, ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
ఇంతకీ అదేంటంటే? - రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన యమదొంగ సూపర్ హిట్ మూవీ. అలానే సినిమాలోని పాటల అన్నీ కూడా సూపర్ హిట్టే. ముఖ్యంగా మమతా మోహన్‌దాస్ - ఎన్టీఆర్ కలిసి చిందులేసిన "నువ్వు ముట్టుకుంటేనే తట్టుకుంటాను" పాట అయితే హైలైట్ అనే చెప్పాలి. ఈ రొమాంటిక్ సాంగ్‌లో ఎన్టీఆర్-మమతా- కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ పాటనే దేవర చుట్టమల్లే సాంగ్‌తో మిక్స్ చేశారు అభిమానులు. ఈ ఆడియోకే దేవర సాంగ్ వీడియోను జత చేసి ఫ్యాన్ మేడ్ వీడియోగా వదిలారు. ఇది చూసిన నెటిజన్లు ఆ లిరిక్స్‌కు ఈ వీడియో సూపర్‌గా సూట్ అయిందంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. సాంగ్‌ను మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు.