Nithya Menon Name Secret : నిత్యా మేనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందం, సహజ నటనతో ఎంతో మంది కుర్రాళ్లను తన ఫ్యాన్స్‌గా మార్చుకుంది. ప్రస్తుతం కథా బలమున్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకెళ్తోంది. రీసెంట్గా ఆమె హీరో ధనుశ్‌తో కలిసి చేసిన 'తిరుచిత్రాంబలం' చిత్రంలో నటనకుగానూ బెస్ట్ యాక్ట్రెస్‌గా నేషనల్ అవార్డుకు కూడా ఎంపికైంది.
అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిత్యా మేనన్ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది. 'మేనన్' అనేది తన ఇంటి పేరు కాదని, దాన్ని పెట్టుకోవడానికి ఓ కారణం ఉందని తెలిపింది. తన అసలు పేరు ఎన్‌ఎస్ నిత్య అని చెప్పింది.
తన తల్లిదండ్రుల పేర్లు నళిని, సుకుమార్ అని చెప్పిన నిత్యా మేనన్, ఆ పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకుని ఎన్‌ఎస్ అని పెట్టుకున్నట్లు తెలిపింది. తమ ఫ్యామిలీలో ఎవరూ ఇంటి పేరును వాడరని పేర్కొంది. ఎందుకంటే కులాన్ని పేర్లతో ముడిపెట్టడం ఇష్టం ఉండదని చెప్పుకొచ్చింది.
నటిగా చాలా చోట్లకు ప్రయాణాలు చేయాల్సి వస్తుందని చెప్పిన నిత్యా, అందుకే పాస్‌పోర్ట్‌లో తన పేరుకు 'మేనన్' అని జత చేసినట్లు తెలిపింది. కేవలం న్యూమరాలజీ ఆధారంగానే తాను మేనన్ అని జత చేసినట్లు చెప్పింది. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.