NBK Unstoppable Daaku Maharaaj Team : నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలతో పాటు అన్‌స్టాపబుల్ హోస్ట్‌గా రాణిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ వేదికపై తన అప్‌కమింగ్ మూవీ 'డాకు మహారాజ్' కోసం ఓ స్పెషల్ ప్రోమోషనల్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగా 'అన్‌స్టాపబుల్'కు ఆ మూవీ టీమ్‌ను ఇన్వైట్ చేశారు. ఇక డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ప్రొడ్యూసర్ నాగవంశీ తమదైన స్టైల్లో సందడి చేసి ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు.
ప్రోమోలో హైలైట్స్ ఇవే :
ఇక ప్రోమోలో తమన్ స్పెషల్ ఎంట్రీ ఇచ్చి "ఫస్ట్ టైమ్ థియేటర్లలో స్పీకర్లు తగలబడిపోయింది మీ సినిమాకే" అంటూ బాలయ్యతో అంటారు. దానికి బాలయ్య "మీ స్పీకర్ల కెపాసిటీని పెంచుకో! డాకు మహారాజ్ వస్తోంది అంటూ సూపర్ రెస్పాన్స్ ఇస్తారు. ఇక "నీ గురించి చాలా విన్నాను. ఎన్నో ఇంటర్నేషనల్ స్టోరీస్ విన్నాను. నీకు అనుష్క అంటే చాలా ఇష్టం కదా?" అంటూ కాసేపు తమన్‌ను ఆటపట్టించారు బాలయ్య.
ఇదిలా ఉండగా, "నాకు అయితే రష్మిక అంటే ఇష్టం. తనకు పెళ్లి ఫిక్స్ అయినట్టు ఉంది కదా?" అని నిర్మాత నాగ వంశీని బాలయ్య అడగ్గా, దానికి "తెలుగు ఇండస్ట్రీలో హీరోని పెళ్లి చేసుకుంటున్నారని తెలుసు. కానీ ఎవరిని, ఎప్పుడు అనేది తెలీదు" అంటూ సమాధానం చెప్పారు నాగ వంశీ. ఇక "చెప్పమ్మా కొంచెం లీకులు ఇద్దాము" అంటూ బాలయ్య ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు. ఇలా ప్రోమో మొత్తం ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రశ్నలతోనే సాగింది.