Nayanthara Instagram account Unfollow : స్టార్ హీరోయిన్ నయనతార రీసెంట్గా ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో తరచుగా తన ఫ్యామిలీకి సంబంధించి, ముఖ్యంగా తన పిల్లలకు సంబంధించిన పోస్ట్‌లను చేస్తూ ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాలో 78లక్షల మంది వరకు ఫాలోవర్స్ ఉన్నారు.
అయితే, తాజాగా నయన్ తన భర్త విఘ్నేశ్ శివన్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేయడం అభిమానుల్లో, సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దీంతో నెటిజన్లు ఈ విషయమై రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. పొరపాటున ఇలా జరిగి ఉంటుంది అని ఒకరు కామెంట్ చేయగా సాంకేతికలోపం వల్ల విఘ్నేశ్ పేరు కనిపించడం లేదేమో అని మరొకరు అంటున్నారు.
అసలే ఈ మధ్య కాలంలో నటీనటులు డివొర్స్ తీసుకునే ముందు సోషల్ మీడియాలో హింట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ సమంతతో మొదలై ఇప్పుడు ఉన్న సెలబ్రెటీలంతా ఈ అన్ఫాలోనే ఫాలో అవుతున్నారు. భర్త నాగ చైతన్యతో విడిపోవడానికి ముందు సామ్ తన ఇన్‌స్టాలో పేరు మార్చింది. అనంతరం అన్‌ఫాలో చేసింది. దీంతో ఫ్యాన్స్ కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్గా కూడా ఎంతో అన్యోనంగా కనిపించిన ఈ జంట నుంచి ఏదైనా బ్యాడ్ న్యూస్ వినిపిస్తుందా? అని కంగారు పడుతున్నారు. అసలు ఏం జరుగుతుందోనని అంతా డైలామాలో ఉన్నారు. కాగా, సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న నయనతార - విఘ్నేశ్ శివన్ పెద్దల అంగీకారంతో రెండేళ్ల క్రితమే 2022 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. అంతలోనే నయన్ ఈ అన్‌ఫాలో చేయడం హాట్ టాపిక్‌గా మారింది.