తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'కల్కి' సెలబ్రేషన్స్​ - ఫ్యాన్స్ సందడితో మోతెక్కిపోతున్న థియేటర్లు! - Kalki 2898 AD Movie Review - KALKI 2898 AD MOVIE REVIEW

Kalki 2898 AD Movie Review Fans Celebrations : తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కల్కి మేనియా మొదలైపోయింది. భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్ల దగ్గరకు చేరుకుని బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. డీజేలతో హోరెత్తిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలను చూసేద్దాం.

source ETV Bharat
Kalki 2898 AD Movie Review Fans Celebrations (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 27, 2024, 10:10 AM IST

Kalki 2898 AD Movie Review Fans Celebrations : తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కల్కి మేనియా మొదలైపోయింది. వరల్డ్​ వైడ్​గా దాదాపు 10 వేలకుపైగా స్క్రీన్స్​లో సినిమాను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే రోజుకు ఐదు షోలతో పాటు అదనంగా బెనిఫిట్ షో ప్రదర్శనకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తెల్లవారుఝామునే థియేటర్ల వద్దకు చేరి సంబరాలు చేసుకోవడం ప్రారంభించేశారు.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని హీరో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఉప్పొంగిపోతున్నారు. రెండు రాష్ట్రాల్లోని థియేటర్స్ వద్ద ప్రభాస్​కు సంబంధించిన భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు. బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. పాలాభిషేకాలు చేస్తున్నారు. డీజేలతో హోరెత్తిస్తున్నారు. దీంతో కల్కి సినిమాను ప్రదర్శించే థియేటర్లు దగ్గర కోలాహం నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Kalki 2898 AD Movie Review : కాగా, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కి 2898 AD తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణె, దిశా పటాని, యూనివర్స్ స్టార్ కమల్ హాసన్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, సీనియర్ నటి శోభన, మాళవిక నాయర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. వీరందరిలో బిగ్​ బీ, యూనివర్సల్ స్టార్, ప్రభాస్​, దుల్కర్​, దేవరకొండ పాత్రలు బాగా హైలైట్​ అయ్యాయి. సోషల్ మీడియాలో వీరికి సంబంధించిన సన్నివేశాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా సంతోశ్​ నారాయణన్ అందించిన సంగీతం సినిమాకు ప్రాణం పోసిందని అంటున్నారు. మొత్తంగా ఎపిక్​ బ్లాక్ బాస్టర్​ అని రివ్యూలు ఇస్తున్నారు. డే1 వసూళ్లు(Kalki 2898 AD Collections) సరికొత్త రికార్డులు సృష్టిస్తాయని, మొత్తంగా లాంగ్ రన్​ టైమ్​లో రు.2000 వేల కోట్లు సాధించడం పక్కా అని అంటున్నారు.

'కల్కి' ట్విటర్ రివ్యూ - సినిమా టాక్ ఎలా ఉందంటే? - Kalki 2898 AD Movie Review

'కల్కి' విజయ్​ దేవరకొండ, దుల్కర్​ ర్యాంపేజ్​ - ఈ హైలైట్​ సీన్స్​ చూశారా? - Kalki 2898 AD Movie

ABOUT THE AUTHOR

...view details