తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

భారీ ధరకు 'తండేల్' ఓటీటీ రైట్స్ - చైతూ కెరీర్​లో ఫస్ట్​ టైమ్​ - Naga Chaitanya Thandel Movie - NAGA CHAITANYA THANDEL MOVIE

Thandel Movie OTT Rights : నాగచైతన్య తండేల్ ఓటీటీ రైట్స్​ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. ఆ విశేషాలు మీ కోసం

NAGA CHAITANYA THANDEL MOVIE OTT RIGHTS
NAGA CHAITANYA THANDEL MOVIE OTT RIGHTS

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 1:17 PM IST

Updated : Apr 29, 2024, 2:58 PM IST

Thandel Movie OTT Rights :టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'తండేల్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. హైదరాబాద్​లో పలు కీలక సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరిస్తున్నారట. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్​లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్​డేట్​ నెట్టింట ట్రెండ్ అవుతోంది.

ఈ మూవీ అన్ని భాషల డిజిటల్ రైట్స్​ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్​ సుమారు రూ. 40 కోట్లకు సొంతం చేసుకుందట. అయితే చైతూ ఇప్పటి వరకు తీసిన సినిమాల ఓటీటీ రైట్స్ కంటే ఇది ఎక్కువ అని సమాచారం. అందుకే ఈ 'తండేల్'తో అటు మూవీ టీమ్​తో పాటు చైతూ కూడా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

ఇక తండేల్ సినిమా విషయానికి వస్తే, గీతా ఆర్ట్స్‌ బ్యానర్​పై ప్రముఖ నిర్మాత బన్నీవాస్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో చైతూ ఓ మత్స్యకారుడిగా కనిపించనున్నారు.

ఒక మత్స్యకారుడి నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఇది తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ కథంతా సముద్ర తీర ప్రాంతం చుట్టూనే తిరుగనుంది. శ్రీకాకుళంలో మొదలై పాకిస్థాన్ వరకూ చేరుకుంటుందట. సాయిపల్లవి హీరోయిన్​గా నటిస్తోంది. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని మొదట వేసవికి రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ అక్టోబర్​కు వాయిదా వేసినట్టు సమాచారం. ఈ మూవీ విడుదలపై ఆ సినిమా యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

ఇటీవలె ఈ మూవీ గ్లింప్స్​ను మేకర్స్ రివీల్ చేశారు. అందులో నాగ చైతన్య రగ్గ్‌డ్ లుక్​లో కనిపించగా, సాయి పల్లవి తన క్యూట్ లుక్స్​తో ఆకట్టుకున్నారు. బోటుపై చేపల వేటకు వెళ్తున్న చైతూ 'దద్దా గుర్తెట్టుకో ఈపాలి యాట గురి తప్పేదెలేదేస్ ఇక రాజులమ్మ జాతరే' అంటూ చెప్పే డైలాగ్‌ అభిమానులను ఆకట్టుకుంది.

'తండేల్' రిలీజ్​పై డైరెక్టర్ క్లూ- ఆ స్టార్లతో బాక్సాఫీస్ పోటీకి సై!

నాగ చైతన్య 'తండేల్​' గ్రాండ్ లాంఛ్​ - స్పెషల్ అట్రాక్షన్​గా సాయి పల్లవి!

Last Updated : Apr 29, 2024, 2:58 PM IST

ABOUT THE AUTHOR

...view details