Nag Ashwin Mahesh Babu :కల్కి 2898 ఏడీ మూవీతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. నేషనల్ వైడ్ గా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. విశేషమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. మహానటి మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఆయన, కల్కి చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం దక్కించుకున్నారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుకున్నారు అశ్విన్.
ఇప్పుడు కల్కి పార్ట్-2 వర్క్స్‌లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రెండు పార్టులుగా సినిమాలు రూపొందడం, కల్కి చిత్రంలోని ప్రభాస్ రోల్ పై కామెంట్స్ రావడం, కృష్ణుడిగా మహేష్ బాబు నటించడం, అలా వివిధ విషయాలపై నాగ్ అశ్విన్ మాట్లాడారు.
కృష్ణుడి పాత్రకు టాలీవుడ్‌లో ఏ హీరోని మీరు ఎంపిక చేస్తారు? అని ఓ అభిమాని అడగ్గా, తాను కల్కి యూనివర్స్‌లో కృష్ణుడి పాత్రధారి ముఖం కనిపించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఒకవేళ పూర్తిస్థాయి పాత్రలో మహేశ్ బాబు నటిస్తే ఆయన అభిమానులకు పండగే అనుకుంటానని చెప్పి వైరల్‌గా మారాయి.
టీజర్ రిలీజ్‌కు ముందే ఆల్‌టైమ్ బ్లాక్ బ్లస్టర్‌గా నిలుస్తుందనిపిస్తుందని తెలిపారు. ఖలేజాలో ఆయన పోషించిన పాత్ర (దేవుడిలాంటి క్యారెక్టర్) తనకు ఇష్టమని చెప్పారు. అర్షద్ లాంటి వారు తమ అభిప్రాయం వ్యక్తం చేశారని, అంచనాలు పెట్టుకుని చూడడం వల్ల భైరవ పాత్ర నచ్చలేదని అన్నారు. కానీ మాకు భైరవ బాగా నచ్చాడనన్నారు.
సినిమా కథను బట్టి మార్పులు జరుగుతాయని, కొందరు రెండు పార్ట్‌లను ఒకేసారి చిత్రీకరిస్తారని చెప్పారు. దాని వల్ల బడ్జెట్‌పై పెద్దగా ప్రభావం ఉండదని అన్నారు. అదే రెండు పార్ట్‌లు రెండు సార్లు షూట్ చేస్తే బడ్జెట్ పెరుగుతుందని చెప్పారు. పెద్ద కథ, సింగిల్ పార్ట్ అనే ఆలోచనతోనే టీమ్ అంతా పని చేస్తుందని తెలిపారు. ఇది రెండు పార్ట్‌లు అయ్యేలా ఉందని ఒకానొక సమయంలో ప్రభాస్ అభిప్రాయం వ్యక్తం చేశారని అన్నారు నాగ్ అశ్విన్.