Nabha Natesh Priya darshi :నన్ను దోచుకుందువటే చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ మూవీ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత రెండేళ్లు ఎవరికి కనిపించలేదు. అందుకు కారణం ఆమెకు యాక్సిడెంట్ అవ్వడం, శస్త్ర చికిత్సలు జరగడం. ప్రస్తుతం వీటి నుంచి పూర్తిగా కోలుకుని మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు.
అయితే ఇప్పుడామె ప్రియదర్శి హీరోగా చేస్తున్న డార్లింగ్ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సినిమాలో వీరు నిత్యం గొడవపడే భార్యాభర్తలుగా కనిపించనున్నారు. ప్రమోషన్స్‌ను కూడా ఈ మూవీ థీమ్‌కు తగ్గట్టుగానే రెెండు మూడు రోజుల నుంచి చేస్తున్నారు. అలా తాజాగా టైటిల్ ప్రోమో రిలీజ్ ఈవెంట్లోనూ వీరు స్టేజిపై గొడవ పడుతూ ప్రమోషన్స్ చేశారు.
ఈ క్రమంలోనే ప్రియదర్శి మాట్లాడుతూ "ఈ రెండేళ్లలో నేను ఐదు సినిమాలు చేశాను. నువ్వు ఒక సినిమా కాదు కదా, సినిమా ఈవెంట్లోనూ కూడా కనిపించలేదు” అంటూ మాట్లాడారు. దీనికి నభా ఎమోషనల్‌గా రియాక్ట్ అయింది. సినిమా ప్రమోషన్స్ అని చెప్పి పర్సనల్ లైఫ్ ఎందుకు మాట్లాడుతున్నారు. ఈ రెండేళ్లలో నాకు ఏం జరిగింది, దాని నుంచి కోలుకోవడం కోసం నేను ఎంత కష్టపడ్డాను అనేది మీకు కూడా తెలుసు. అయినా మీరు ఇలా మాట్లాడటం సరికాదుఅంటూ స్టేజ్ మీద నుంచి వెళ్లిపోయింది. ప్రియదర్శి ఆమెను ఆపడానికి ట్రై చేసినా కూడా వినకుండా వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు స్క్రిప్ట్‌లో భాగంగానే ఇలా చేశారోమో అని కామెంట్స్ పెడుతున్నారు.