Naa Saami Ranga Movie OTT Release :సంక్రాంతి బరిలో సందడి చేసేందుకు దిగిన సినిమాల్లో 'నా సామి రంగ ఒకటి'. నాగార్జున, రాజ్ తరుణ్, అల్లరి నరేశ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో పాటు టాక్‌ను కూడా అందుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీగా ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమ్ కానున్నట్లు హాట్‌స్టార్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో నాగ్ సరసన కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ నటించింది. విజయ్ బిన్ని ఈ సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో మిర్నా మేనన్, రుక్సర్ థిల్లాన్, నాజర్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
స్టోరీ ఏంటంటే :
కిష్టయ్య (నాగార్జున) ఓ అనాథ. అంజి (అల్లరి నరేశ్) తల్లి అతడ్ని చేరదీస్తుంది. అప్పటి నుంచి వారిద్దరూ సొంత అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటారు. తల్లి మృతిచెందిన తర్వాత పిల్లలిద్దరికీ ఆ ఊరి ప్రెసిడెంట్ పెద్దయ్య (నాజర్) అండగా నిలబడతాడు. అయితే కిష్టయ్య 12 ఏళ్ల వయసులోనే వరాలు (ఆషికా రంగనాథ్)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతడ్ని ప్రేమిస్తుంది. చదువుల కోసం పట్టణానికి వెళ్లిపోయిన వరాలు, 15 ఏళ్లకు తిరిగి వస్తుంది. దీంతో వీరిద్దరి లవ్ స్టోరీ మళ్లీ మొదలవుతుంది. ఇక తన ప్రేమ విషయాన్ని పెద్దయ్యకు చెప్పేందుకు వరాలును తీసుకొని కిష్టయ్య ఇంటికి వెళ్తాడు.