తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బాహుబలి 2, RRR, దంగల్​ కాదు​ - 25 కోట్ల టికెట్లు అమ్ముడుపోయిన సినిమా ఏంటో తెలుసా? - Most Tickets Sold Movie In India - MOST TICKETS SOLD MOVIE IN INDIA

Most Tickets Sold Movie In India : ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన బాహుబలి, ఆర్ఆర్ఆర్, దంగల్ లాంటి సినిమాలు కూడా దక్కించుకోని రికార్డును ఓ ఇండియన్ సినిమా సొంతం చేసుకుంది. థియేటర్లలో ఎక్కువ మంది చూసిన చిత్రంగా నిలిచింది. అదేంటంటే?

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 6:10 PM IST

Most Tickets Sold Movie In India :ఈ రోజుల్లో సినిమా హిట్ లేదా ఫ్లాప్​ అనే విషయాన్ని సినిమా కలెక్షన్ల రూపంలో మాట్లాడుకుంటున్నాం. రిలీజ్ అయిన మొదటి రోజు ఎంత వసూలు చేసింది. థియేటర్లలో ఉన్నన్ని రోజులు ఎంత బిజినెస్ అయిందని లెక్కలు వేస్తున్నాం. కానీ, స్టేజీ డ్రామాల నుంచి థియేటర్లకు మారుతున్న అప్పటి రోజుల్లో కలెక్షన్లలో కాదు. ఎన్ని టిక్కెట్లు అమ్ముడుపోయాయి, ఎన్ని రోజులు ఆడింది మాత్రమే చూసేవాళ్లు.

ప్రస్తుతం కాలంలో దక్షిణాది నుంచి వచ్చిన "ఆర్ఆర్ఆర్", "బాహుబలి", "కేజీఎఫ్" లాంటి పాన్ ఇండియా మూవీస్, బాలీవుడ్ లో విడుదలైన "జవాన్" లాంటి సినిమాలు కమర్షియల్ హిట్ సాధించినప్పటికీ టిక్కెట్ల విషయంలో అప్పటి ఓ సినిమా దరిదాపులకు కూడా చేరుకోలేకపోయాయి. అవును మీరు చదివింది నిజం. ఆ సినిమా మరేదో కాదు. రమేశ్ సిప్పీ డైరక్షన్​లో వచ్చిన "షోలే". ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమామాలిని కీలక పాత్ర పోషించారు. బాక్సాఫీసు రికార్డు వివరాల ప్రకారం 1975-80 కాలంలో విడుదలైన ఈ సినిమాకు అప్పట్లో కేవలం ఇండియాలోనే 18కోట్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయట. ఇంకా, ఈ సినిమా 60 థియేటర్లలో గోల్డెన్ జూబిలీ షో కూడా వీక్షించారట. అదేనండీ వంద రోజుల షో అంటారు కదా అదే.

బాంబే మినర్వా థియేటర్లో ఈ చిత్రం ఏకంగా ఐదేళ్ల పాటు ఆడిందట. ఇంకా సోవియట్ రష్యాలో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అయితే ఈ సినిమాను చూసేందుకు 4.8కోట్ల మంది థియేటర్లకు కదిలి వెళ్లారట. అలా మొత్తంగా ఈ సినిమాను అప్పట్లోనే 25 కోట్ల మంది వీక్షించారని తెలిసింది.

అయితే ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన "షోలే" సినిమా విడుదలైన తర్వాత దాదాపు రెండు వారాల వరకూ ప్లాప్ టాక్‌ను మూట గట్టుకుందట. కానీ మూడో వారం నుంచి పుంజుకుందట. మొత్తంగా రూ.30కోట్ల వరకు వసూలు చేసి "మొఘల్ ఏ అజామ్", "మదర్ ఇండియా బై ఏ మైల్" లాంటి సినిమాల రికార్డును బ్రేక్ చేసేసింది. కాగా, పాన్ ఇండియా మూవీగా రిలీజైన బాహుబలి- 2కు 15-20 కోట్ల టిక్కెట్లు, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్- 2, దంగల్ సినిమాలకు 10 కోట్ల టిక్కెట్లు అమ్ముడుపోయాయని తెలిసింది.

'రాజాసాబ్' సెట్స్​లోకి ప్రభాస్ ఎంట్రీ - న్యూ లుక్​లో ఎలా ఉన్నారంటే ? - Prabhas New Look

బన్నీ ఫ్యాన్స్​ గెట్​రెడీ- 'పుష్ప 2' నుంచి మరో టీజర్- తర్వాత సాంగ్ కూడా! - Pushpa 2 Update

ABOUT THE AUTHOR

...view details