Mokshagna Jr NTR :నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకంక్షలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజాగా జూనియర్ ఎన్‌టీఆర్ పోస్ట్ నందమూరి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. తన సోదరుడు మోక్షూకు బర్త్‌డే విషెస్ చెప్పిన తారక్, దాంతో పాటు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినందకు అభినందనలు తెలిపారు.
"సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు! నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాతగారితో పాటు అన్ని దైవ శక్తులు నీపై ఆశీస్సులు కురిపించాలని కోరుకుటుంన్నాను! హ్యాపీ బర్త్‌డే మోక్షూ" అంటూ జూనియర్ ఎన్‌టీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసి నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అన్నదమ్ముల అనుబంధం అంటే ఇలానే ఉండాలని అంటున్నారు.
ఇదిలా ఉండగా, నందమూరి హీరో కల్యాణ్ రామ్ కూడా తన తమ్ముడు మోక్షజ్ఞకు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు. "టిన్సెల్ టౌన్‌కు నీకు స్వాగతం మోక్షు. తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్‌డే" అంటూ ట్వీట్ చేశారు.
పుట్టినరోజు శుభాకాంక్షలు మోక్షజ్ఞ. నీ అరంగేట్రం కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. రానున్న ఏడాదిలో నువ్వు ఎన్నో విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాను - గోపిచంద్ మలినేని