తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'సినిమాల్లోకి రావాలనుకోలేదు - భారత్ తరఫున ఆడాలనుకున్నా' - Mirzapur Ali Fazal - MIRZAPUR ALI FAZAL

Mirzapur Ali Fazal Dream : మీర్జాపుర్ ఫేమ్ అలీ ఫజల్ తాజాగా తన మనసులోని మాట బయటపెట్టారు. తాను సినిమాల్లోకి అస్సలు రావాలనుకోలేదని తనకు వేరే డ్రీమ్ ఉందని పేర్కొన్నారు.

Mirzapur Ali Fazal Dream
Ali Fazal (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 12:51 PM IST

Mirzapur Ali Fazal Dream :బాలీవుడ్ స్టార్ హీరో అలీ ఫజల్ తాజాగా 'మీర్జాపూర్‌ 3'తో మాసివ్ సక్సెస్​ అందుకున్నారు. ఇందులోని ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక తాజాగా ఈ సిరీస్‌ ప్రమోషన్స్‌లో ఆయన పాల్గొని సందడి చేశారు. అందులో భాగంగా యాంకర్ అడిగిన ప్రశ్నలకు బదులిస్తూనే, తన గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

"యాక్టర్ కావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను ఓ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ని. దేశం తరఫున ఆడాలని చిన్నతనంలోనే ఎన్నో కలలు కన్నాను. స్కూల్‌ డేస్‌లో నాకో యాక్సిడెంట్ జరిగింది. దాని వల్ల భుజానికి తీవ్ర గాయమైంది. అయితే గాయం మానిన తర్వాత తిరిగి బాస్కెట్‌బాల్‌ ఆడేందుకు ఎంతగానో ప్రయత్నించాను కానీ అది వీలుపడలేదు. అంతేకాకుండా ఆటలకు దూరంగా ఉండాలని వైద్యులు కూడా చెప్పడం వల్ల యాక్టింగ్​లోకి ఎంట్రీ ఇచ్చాను. మీర్జాపూర్‌లో నటించినప్పుడు ఈ సిరీస్ వర్కౌట్‌ అవుతుందని, ఇంతటి ఘన విజయాన్ని అందుకుంటుందని మేం అస్సలు ఊహించలేదు. రిలీజైన కొన్ని రోజుల పాటు ఎవ్వరూ దీని గురించి మాట్లాడుకోలేదు. వారం రోజుల తర్వాతనే ఆ షో కాస్త ఊపందుకుంది. ఇక అప్పటి నుంచి మేము వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఫారిన్​ కంట్రీస్​లో ఇటువంటి కంటెంట్‌తో ఎన్నో సినిమాలు, షోలు వస్తున్నాయి. అందుకే ఇందులోయాక్ట్‌ చేసేందుకు నేను భయపడలేదు" అని అలీ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details