సినిమాల్లో చాలా మంది తమ కెరీర్‌ను గొప్పగా ప్రారంభించినప్పటికీ కొంతకాలానికి తమ పర్సనల్ రీజన్స్ కారణంగా ఈ ఫీల్డ్‌కు దూరమవుతుండటం మనం చాలా సార్లు చూశాం. అలా వెండితెరపై ఓ వెలుగు వెలిగి ఆకస్మికంగా కనుమరుగైపోయిన ఓ స్టార్ హీరోయిన్ గురించే ఈ స్టోరీ. బీటౌన్‌లో తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని పాపులర్ అయిన ఈ స్టార్ ప్రస్తుతం అన్నింటికీ దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక మార్గాన్ని స్వీకరించారు. ఇంతకీ ఆమె ఎవరంటే?
90స్లో బాలీవుడ్ ప్రేక్షకులను అమితంగా ఆకర్షించిన హీరోయిన్లలో మమతా కులకర్ణి ఒకరు. అతి తక్కువ కాలంలోనే అద్భుత అవకాశాలు అందుకున్నారీ నటి. తన యాక్టింగ్‌తో వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. 1992లో 'తిరంగా' అనే మూవీ ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాలోనే టాప్ యాక్టర్‌లైన రాజ్ కుమార్, నానా పటేకర్‌తో కలిసి నటించారు. తన అందం, అభినయంతో అప్పట్లోనే చాలా మంది స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకున్నారు. సల్మాన్, అమీర్, షారుక్తోనూ ఈమె స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
మమతా కులకర్ణి సూపర్‌హిట్ మూవీలు
మమతా కులకర్ణి తన కెరీర్‌లో అనేక సూపర్‌హిట్ మూవీలు తన ఖాతాలో వేసుకున్నారు. 'ఆషిక్ ఆవారా' (1993), 'వక్త్ హమారా హై' (1993), 'క్రాంతి వీర్' (1994), 'కరణ్ అర్జున్' (1995), 'సబ్సే బడా ఖిలాడి' (1995), 'ఆందోళన్' (1995), 'బాజీ' (1996), 'చైనా గేట్' (1998), 'చుపా రుస్తం : ఎ మ్యూజికల్ థ్రిల్లర్' (2001) ఉన్నాయి.