తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

5 ఏళ్లుగా సినిమాలకు దూరం, అయినా వందల కోట్ల ఆదాయం - ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే ? - అనుష్క శర్మ నెట్​ వర్త్​

ఆమె బాలీవుడ్​లో పాపులర్ హీరోయిన్​. తన నటనతో ఇండస్ట్రీకి పలు సూపర్ హిట్ సినిమాలు అందించింది. అయితే గత ఐదు సంవత్సరాలుగా ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినప్పటికీ టాప్ సెలబ్రిటీగానే తన క్రేజ్​ను కొనసాగిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరంటే ?

Anushka Sharma Luxury Lifestyle
Anushka Sharma Luxury Lifestyle

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 10:33 PM IST

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు తమ స్టార్​డమ్​ను అనతికాలంలోనే సంపాదించుకుంటుంటారు. అయితే ఆ తర్వాత వాళ్లు క్రమక్రమంగా ఫేడ్​ అవుట్ అవుతుంటారు. దీనికి పలు కారణాలు ఉండొచ్చు. అయితే వాళ్లు సినిమాలకు దూరమైనప్పటికీ అందులో కొంతమందే తమ క్రేజ్​ను కొనసాగిస్తుంటారు. అలాంటివారిలో తాజాగా బాలీవుడ్​కు చెందిన ఓ స్టార్ హీరోయిన్ చేరింది.

గత ఐదేళ్లుగా ఒక్క సినిమా కూడా చేయని ఆ స్టార్ హీరోయిన్, ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కూడా ఇప్పటికీ టాప్ సెలబ్రిటీగా కొనసాగుతోంది. ఎటువంటి ప్రాజెక్టులకు సైన్​ చేయనప్పటికీ కోట్లలో సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ.

20218లో 'జీరో' అనే సినిమాలో చివరిసారిగా కనిపించిన అనుష్క ఆ తర్వాత ఎటువంటి సినిమాలకు సైన్ చేయలేదు. చద్దా ఎక్స్​ప్రెస్​ షూటింగ్ చేసినప్పటికీ ఈ సినిమా రిలీజ్​ పోస్ట్​పోన్ అవుతూ వస్తోంది. అయినప్పటికీ తన స్టార్​డమ్​తో కోట్లు సంపాదిస్తూ సంచలనాలు సృష్టిస్తోంది.

2017లో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకున్న అనుష్క 2021లో వామిక అనే చిన్నారికి జన్మనిచ్చింది. అయితే పెళ్లి తర్వాత సినిమాల్లో అంతగా కనిపించని అనుష్క సంపాదన మాత్రం తగ్గేదే లే అంటూ దూసుకెళ్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉంటూ బ్రాండ్​ ఎండార్స్​మెంట్స్ రూపంలో భారీగా సంపాదిస్తోందట. ఈ నేపథ్యంలో అనుష్క శర్మ నికర సంపద విలువ రూ. 250 కోట్ల నుంచి రూ. 300కోట్ల మధ్య ఉంటుందని సమాచారం. మరోవైపు అనుష్క ఒక్క యాడ్​లో నటించేందుకు రూ. 3 కోట్లు వసూలు చేస్తుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీంతో పాటు పలు ప్రముఖ కంపెనీల్లో కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిందట.

Anushka Sharma Luxury Life : మరోవైపు విరుష్క జంటకు ముంబయిలో రూ.34 కోట్లు, గుర్గావ్‌లో రూ.80 కోట్ల విలువ చేసే నివాసాలు ఉన్నాయట. తాజాగా అలీబాగ్‌లో రూ.19 కోట్ల ఫామ్‌హౌస్‌ను కూడా విరాట్​ దంపతులు కొనుగోలు చేశారు. దీంతో పాటు విరాట్, అనుష్కలకు ఇతర విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయట. ఇందులో ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్ పాత ఇల్లు కూడా ఉంది. దీన్ని ఇప్పుడు హై-ఎండ్ రెస్టారెంట్‌గా మార్చి అక్కడ రెస్టారెంట్​ బిజినెస్​ను రన్ చేస్తున్నారు. ఇక ఈ జంట లగ్జరీ కార్లను ఇష్టపడుతారట. వీరి దగ్గర Audi R8, Audi A8 L, Audi Q8, Audi Q7, Audi RS 5, Audi S5, రేంజ్ రోవర్ వోగ్, బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ , బెంట్లీ కాంటినెంటల్ GT వంటి స్పోర్ట్స్ కార్లు ఉన్నాయని సమాచారం.

వ‌య‌సు పెరిగినా తగ్గని క్రేజ్‌, సంపాద‌న- భారత్​లోనే రిచ్చెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Virat Kohli World Cup 2023 : నెట్టింట విరుష్క పోస్ట్​.. ఆ విషయాన్ని అడిగి విసిగించవద్దంటూ స్పెషల్​ రిక్వెస్ట్​..

ABOUT THE AUTHOR

...view details