Mathuvadalara 2 Twitter Review :యంగ్ హీరోశ్రీసింహా లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'మత్తు వదలరా 2'. దీనికి ముందు వచ్చిన ఫస్ట్ పార్ట్ మంచి సక్సెస్ అందుకోగా, ఇప్పుడు దీని సీక్వెల్ కూడా థియేటర్లలో సందడి చేస్తోంది. తాజాగా వచ్చిన టీజర్, ట్రైలర్‌కు వచ్చిన విశేష స్పందనతో ఈ చిత్రంపై అంచనాలు బాగానే పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రీమియర్స్ చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ సినిమాపై తమ అభిప్రాయం పంచుకున్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉందంటే?
ప్రస్తుతం ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైనింగ్గా ఉందని నెటిజన్లు అంటున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కడుపుబ్బా నవ్విస్తోందని పేర్కొన్నారు. రైటింగ్ చాలా బాగుందని, సత్య కామెడీ టైమింగ్ సూపర్ అని కామెంట్ చేస్తున్నారు. ఈ మూవీ చూసి నవ్వుకోవడం గ్యారెంటీ అని, ఈ సినిమాను తప్పకుండా థియేటర్లలో చూడలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.