Mathu Vadalara 2 Mahesh Babu Review :యంగ్ హీరోశ్రీ సింహా లీడ్ రోల్లో తెరకెక్కిన 'మత్తు వదలరా 2' ఇప్పుడు పాజిటివ్ టాక్ అందుకుని దూసుకెళ్తోంది. కామెడీ ఎంటర్ట్రైనర్ రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను నవ్విస్తూ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాను వీక్షించి తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, అలాగే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ సినిమా గురించి చేసిన పోస్ట్‌లు ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
'రాత, తీత, కోత, మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేశారు'
రీసెంట్గా మత్తు వదలరా గురించి చిరు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఆయన మూవీ టీమ్‌ను ప్రశంసించిన తీరు కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
"నిన్ననే మత్తు వదలరా 2 చూశాను. ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు. ఎండ్ టైటిల్స్‌ని కూడా వదలకుండా చూశాను. ఈ క్రెడిట్ అంతా రితేశ్ రానాకి ఇవ్వాలి. అతని రాత, తీత, కోత, మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని వినోద పర్చిన విధానానికి అభినందించకుండా ఉండలేము. హాట్స్ ఆఫ్ రితేశ్ రానా. నటీనటులకు, సింహ, ప్రత్యేకించి సత్యకి నా అభినందనలు. అలాగే ఫరియా అబ్దుల్లా, కాల భైరవలకు, మంచి విజయాన్ని అందుకున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు, టీమ్ అందరికీ నా అభినందనలు. అస్సలు మిస్ అవ్వకండి మత్తు వదలరా 2 సినిమా వంద శాతం గ్యారెంటీ ఎంటర్టైన్మెంట్" అని చిరు తన అభిప్రాయాన్నితెలియజేశారు.
'ఆ ఇద్దరిని చూసి నా కూతురు నవ్వు ఆపుకోలేకపోయింది'
'మత్తు వదలరా 2' సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉందని , ఈ సినిమా మొత్తం ఎంజాయ్ చేస్తూ చూశానంటూ మహేశ్ బాబు చెప్పుకొచ్చారు. హీరో శ్రీ సింహతో పాటు మిగతా నటీనటులంతా అద్భుతంగా నటించారంటూ ఆయన మెచ్చుకున్నారు.