March 2024 Movie Releases : ఫిబ్రవరి నెల ముగిసింది. మార్చి మొదలుకానుంది. ఎప్పటిలాగే ఈ నెల కూడా పలు చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అయ్యాయి. వీటిలో ఆపరేషన్ వాలెంటైన్, భీష్మ, డీజే టిల్లు స్క్వేర్ ఆసక్తిని పెంచుతున్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.
ఆపరేషన్ వాలాంటైన్(Varun Tej Operation Valentine) : కెరీర్ మొదలు నుంచి వైవిధ్య కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు మెగా హీరో వరుణ్ తేజ్. ఇప్పుడాయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందించిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్లో నటించారు. మానుషి చిల్లర్ హీరోయిన్. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకుడు. మార్చి 1న(Operation Valentine Release Date) ఈ సినిమా రిలీజ్ కానుంది.
Bhoothaddam Bhaskar Narayana : వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలో టీజీ కీర్తికుమార్ తెరకెక్కించిన సినిమా చారి 111 (Chaari 111). సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్. ఇకపోతే శివ కందుకూరి, రాశీసింగ్ నటించిన చిత్రం భూతద్దం భాస్కర్ నారాయణ. పురుషోత్తం రాజ్ దర్శకుడు. గ్రామీణ నేపథ్యంలో సాగే డిటెక్టివ్ కథ ఇది. అలా ఈ రెండు చిత్రాలు మార్చి 1నే రిలీజ్ కానున్నాయి.
Bhimaa Gopichand : గోపీచంద్ లేటెస్ట్ మూవీ ఫాంటసీ యాక్షన్ డ్రామా భీమా. ఎ. హర్ష దర్శకుడు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లు. శివరాత్రిని పురస్కరించుకుని మార్చి 8న ఈ చిత్రం రానుంది. విశ్వక్ సేన్ నటించిన గామి(Vishwak Sen Gaami) మార్చి 8నే రిలీజ్ కానుంది. విద్యాధర్ కాగిత దర్శకుడు. చాందినీ చౌదరి కథానాయిక. ఇక బాలీవుడ్‌హీరో నటుడు అజయ్ దేవగణ్, మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ షైతాన్ కూడా మార్చి 8నే రానుంది. దీనికి వికాస్ భల్ దర్శకుడు. మలయాళ సూపర్ హిట్ ప్రేమలు డబ్బింగ్ మూవీ కూడా మార్చి 8నే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చదవండి :మార్చి నెల ఓటీటీ సినిమా సిరీస్‌ల ఫుల్ లిస్ట్ - హనుమాన్తో పాటు ఏం వస్తున్నాయంటే?