తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 4:26 PM IST

ETV Bharat / entertainment

వెడ్డింగ్ బెల్స్ - ప్రియుడిని పెళ్లాడనున్న 'తీన్​మార్' బ్యూటీ!

Kriti Kharbanda Wedding Card : బాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి కర్బంద త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. బీటౌన్​ నటుడు పుల్​కిత్ సామ్రాట్​తో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఈ జంటకు సంబంధించిన వెడ్డింగ్ కార్డ్​ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని మీరూ ఓ లుక్కేయండి.

Kriti Kharbanda Wedding Card
Kriti Kharbanda Wedding Card

Kriti Kharbanda Wedding Card :బాలీవుడ్ బ్యూటీ కృతి కర్బంద, నటుడు పుల్​కిత్ సామ్రాట్​ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. గతంలోనే తాము మార్చిలో పెళ్లి చేసుకుంటున్నట్లు ఈ జంట హింట్ ఇవ్వగా, ఇప్పుడు వీళ్ల పెళ్లి కార్డు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఎంతో క్యూట్​ అండ్ సింపుల్​గా ఉన్న ఆ వెడ్డింగ్ కార్డు నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. అందులో కృతి, పుల్​కిత్​తో పాటు తమ పెంపుడు జంతువులు కూడా ఉన్నాయి. కానీ వెడ్డింగ్ వెన్యూ, ఇంకా ఈ పెళ్లికి సంబంధించిన ఆ కార్డులో ఇంకేం డీటైల్స్ లేవు. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ జంట మార్చి 13న ఒక్కటి కానున్నట్లు తెలుస్తోంది.

Kriti Kharbanda Movies : ఇక కృతి సినిమాల విషయానికి వస్తే - 'బోణీ' అనే తెలుగు సినిమాతో కృతి టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతోనే ఆమె తన కెరీర్​ను మొదలుపెట్టింది. తొలి సినిమా ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టనప్పటికీ, నటిగా ఆమెకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో తెలుగులో వరసు ఆఫర్లు వచ్చాయి. దీంతో 'బోణీ' తర్వాత 'తీన్‌మార్', 'అలా మొదలైంది'. 'మిస్టర్ నూకయ్య', 'ఒంగోలు గిత్త', 'ఓం త్రీడీ', 'బ్రూస్ లీ' ఇలా టాలీవుడ్​లో వరుస ఆఫర్లు అందుకుని ఇక్కడి ప్రేక్షకులకు చేరువైంది.

ఆ తర్వాత కొంతకాలానికి బీటౌన్​కు షిష్ట్​ అయ్యి అక్కడి ఆడియెన్స్​ను అలరించింది. అలా గత ఆరేళ్ల నుంచి పూర్తిగా హిందీ సినిమాలపై ఫోకస్​ పెట్టింది. అప్పుడప్పుడు కన్నడ, తమిళ సినిమాల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే బాలీవుడ్ హీరో పులకిత్ సామ్రాట్‌తో ఈమె రిలేషన్‌లో ఉన్నట్లు గతంలో రూమర్స్ వచ్చాయి.

కొంత కాలం వీటిపై స్పందించని జంట, ఆ తర్వాత ఆ వార్తలు నిజమే అంటూ ఒప్పుకున్నాయి. అప్పటి నుంచి ఈ ఇద్దరూ తమ రిలేషన్​షిప్​ను తెలియజేసేలా పలు పోస్ట్​లు నెట్టింట షేర్ చేసి సందడి చేశారు. కలిసి పలు చోట్లకు తిరిగారు. ప్రస్తుతం ఈ జంట బీటౌన్​లో పలు ప్రాజెక్టులతో బిజీ లైఫ్​ గడుపుతున్నారు.

సీక్రెట్​ రివీల్​ - ఎంగేజ్మెంట్ చేసుకున్న 'తీన్​మార్' హీరోయిన్​ ?

కృతి కర్బంద.. ఈ ముద్దుగుమ్మ సో క్యూట్​!

ABOUT THE AUTHOR

...view details