Actress Krithi Shetty Relationship :తొలి సినిమాతోనే హిట్ టాక్ అందుకుని టాలీవుడ్లో పాపులరైంది యంగ్ హీరోయిన్ కృతి శెట్టి. 'ఉప్పెన'లో బేబమ్మగా కనిపించి కుర్రకారును ఫిదా చేసిన ఈ చిన్నది, ఆ తర్వాత తెలుగులో మంచి ఆఫర్లు సొంతం చేసుకుని దూసుకెళ్లింది. అయితే అందులో పలు సినిమాలు యావరేజ్‌గా రన్ అవ్వడం వల్ల ఈ అమ్మడి క్రేజ్ కాస్త తగ్గింది. అయినప్పటికీ నిరాశ చెందకుండా తన ఛాన్స్ కోసం ఎదురుచూసింది. అలా ఎట్టకేలక 'మనమే' సినిమాలో ఛాన్స్ సంపాదించుకుంది. శర్వానంద్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ ద్వారా ఈ మూవీలో కృతి రోల్ చాలా స్ట్రాంగ్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఈ సినిమా జూన్ 7న విడుదలవ్వనుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ మొత్తం ప్రమోషనల్ ఈవెంట్స్‌లో బిజి బిజీగా గడుపుతోంది. వీళ్లతో పాటు కృతి కూడా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని తన గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటోంది.
ఈ క్రమంలో ఓ యాంకర్ 'మీరు సింగిలా? లేకుంటే రిలేషన్‌షిప్‌లో ఉన్నారా?' అంటూ అడగ్గా, దానికి ఆమె తెలివిగా సమాధానం చెప్పింది. " నా పనితోనే నేను రిలేషన్‌లో ఉన్నాను" అంటూ నవ్వింది. ఇది విన్న యాంకర్ ఒక్కసారిగా అవాకయ్యారు. నెటిజన్లు కూడా ఈ విషయం విని షాకయ్యారు.