Devara Movie Dolby Atmos UK : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటింటిన 'దేవర' విడుదలకు ముందే పలు రికార్డులను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది. యూకేలో డాల్బీ అట్మాస్‌లో ప్రదర్శించనున్న తొలి తెలుగు సినిమా నిలవనుంది. ఈ నెల 26న అక్కడ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేసింది. అలానే లాస్ ఏంజెల్స్‌లో నిర్వహించే ప్రతిష్ఠాత్మక బియాండ్ ఫెస్ట్‌లో ప్రదర్శితం కానున్న మొదటి ఇండియన్ సినిమాగానూ దేవర నిలవనుంది.
Devara Movie Promotions : ఇకపోతే దేవర తొలి భాగం మరో తొమ్మిది రోజుల్లో విడుదల కానుంది. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ రిలీజెస్ 'కల్కి 2898 ఏడీ', 'సరిపోదా శనివారం' తర్వాత అంతకు మించి అనే స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుందని అంతా ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టే దేవర ఇండియా వైడ్‌గా ఆడియెన్స్‌కు రీచ్ అయ్యేందుకు ఎన్టీఆర్ ప్రమోషన్ల కోసం ఎడతెరిపి లేకుండా తిరుగుతూనే ఉన్నారు. ముంబయిలో ట్రైలర్ లాంఛ్ తర్వాత అలియా భట్, కరణ్ జోహార్, సందీప్ రెడ్డి వంగా, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, సహా పలువురితో స్పెషల్ ఇంటర్వ్యూలను పూర్తి చేశారు.