Dhanush Raayan Censor Review : కోలీవుడ్ స్టార్ హీరో, విలక్షణ నటుడు ధనుశ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రాయన్. మరో నాలుగు రోజుల్లో తమిళంతో పాటు, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ మరో కీలక పాత్రలో నటించారు. పక్కా యాక్షన్ డ్రామాగా రాబోతున్నఈ సినిమా ధనుశ్ కెరీర్లో 50వది.
తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అయితే సెన్సార్ టీమ్ కొన్ని మార్పులు చేయాలని సూచించిందట! A సర్టిఫికెట్‌ను జారీ చేసిందని తెలిసింది. చిత్రంలో హింసను ప్రేరేపించే విధంగా రక్తం, ఘర్షణలు వంటి కొన్ని సీన్స్ ఉన్నాయని వాటిని తొలిగించాలని సూచనలు చేసిందని సమాచారం. అలానే ఫైనల్ కాపీ చూసిన తర్వాత రాయన్ యూనిట్ టీమ్‌కు అభినందలు తెలిపారట. ధనుశ్ దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్నారని యూనిట్ వర్గాల సమాచారం.
కాగా, ధనుశ్ ఈ చిత్రంలో పోలీస్ ఇన్ఫార్మర్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. సన్ పిక్టర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు. ఆస్కార్ అవార్డు గ్రహిత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సినిమాలో ప్రకాశ్ రాజ్, సెల్వ రాఘవన్, కాళిదాస్, ఎస్.జే.సూర్య, సందీప్ కిషన్, జయరామ్, దుషరా విజయన్, వరలక్ష్మి శరత్ కుమార్, అపర్ణ బాలమురళీ, శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. ఇకపోతే బ్రహ్మరాక్షసుడిలా వస్తాడు, దహనం చేస్తాడు అంటూ రిలీజైన ప్రచార చిత్రాలు కూడా సినిమాపై ఆసక్తిని బానే పెంచాయి. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో.