Kiran Abbavaram KA Movie :టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' (KA) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్లు సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ శుక్రవారం ట్రైలర్ రిలీజ్ చేయగా, తాజాగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఈ ప్రెస్‌మీట్‌కు హీరో కిరణ్ అబ్బవరం సహా మూవీటీమ్ హాజరైంది. సినిమాలో ఆయన పోషించిన పోస్ట్‌మెన్ క్యారెక్టర్ గెటప్‌లోనే వచ్చారు. ఇక సినిమా గురించి కిరణ్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. సినిమాపై ఈయన చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇది ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమని ఆయన అన్నారు. ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇప్పటివరకూ సినిమా రాలేదని, ఒకవేళ వచ్చినట్టు నిరూపిస్తే ఆయన సినిమాలు చేయడం మానేస్తానని అన్నారు. ఇక ప్రెస్మీట్లో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు కిరణ్ సమాధానమిచ్చారు.
- ట్రైలర్లో 'కాంతార' ఫ్లేవర్ ఎక్కువగా కనిపిస్తుంది?
నైట్ షాట్స్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే అలా అనిపించి ఉండొచ్చు. ఇందులో ఎలాంటి భక్తి సంబంధమైన విషయాలు ఉండవు. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రమే - కిరణ్ ఈ సినిమాలో పాన్‌ఇండియా స్టార్ అవుతారా?
తెలుగు ప్రేక్షకులకు మా సినిమా నచ్చితే చాలు. పాన్ ఇండియా హీరో అవుతానా? అన్ని భాషల్లో ప్రేక్షకులు ఆదరిస్తారా? అనేది తర్వాత విషయం. ఫలితం మీ చేతుల్లోనే ఉంది.