Karthikeya 3:టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ లీడ్‌లో తెరకెక్కిన 'కార్తికేయ', 'కార్తీకేయ- 2' సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాయి. దీంతో దర్శకుడు చందూ మొండేటి కార్తికేయ పార్ట్- 3కి రంగం సిద్ధమ చేస్తున్నారు. రెండో పార్ట్‌కు తెలుగు కంటే, హిందీలో భారీగా రెస్పాన్స్ లభించింది. అక్కడ కలెక్షన్లు కూడా భారీగానే రావడం వల్ల మూడో పార్ట్‌ను కూడా దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
అలా కార్తికేయ- 3తో నిఖిల్- చందూ మొండేటి మరోసారి తెలుగు ప్రేక్షకులతోపాటు దేశవ్యాప్తంగా అలరించనున్నారు. ఈ సినిమా అప్‌డేట్‌ను స్వయంగా నిఖిల్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకూ రిలీజైన కార్తికేయ రెండు పార్ట్‌లలోనూ కథ దేవుడిపై నమ్మకం గురించే నడుస్తుంది. హీరో సైంటిఫికల్‌గా వాస్తవాలను ఒకొక్కటి బయటకు తీస్తుంటే, కథలో జరిగే పరిణామాలు ఆధ్యాత్మిక అంశాలకు లోబడి జరుగుతుంటాయి. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మూడో దశలో ఉంది. గత రెండు సినిమాల కంటే కార్తికేయ- 3 ఇంకా గ్రాండ్‌గా ఉండబోతుందని దర్శకుడు చందూ చెప్తున్నారు. సినిమాలో ఇతర తారాగణం గురించి త్వరలోనే వెల్లడించే ఛాన్స్ ఉంది.
ఇక హీరో నిఖిల్ రీసెంట్గా గామా అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. కార్తికేయ- 2 సినిమాకు గాను నిఖిల్‌కు ఈ అవార్డు దక్కింది. ఇక 2022లో రిలీజైన ఈ మూవీ దేశవ్యాప్తంగా సెన్సేషనల్ హిట్ అందుకుంది. వరల్డ్‌వైడ్‌గా కార్తికేయ- 2 దాదాపు రూ. 120+ కోట్లు వసూల్ చేసింది. హిందీ బెల్ట్‌లో కూడా రికార్డ్ స్థాయిలో వసూల్ చేసింది.