తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కంగనా మూవీ మరోసారి పోస్ట్​పోన్​ - కారణం ఏంటంటే? - Emergeny Movie - EMERGENY MOVIE

Kangana Emergeny Movie : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్​ తెరకెక్కించిన 'ఎమర్జెన్సీ' మూవీ మరోసారి వాయిదా పడింది. ఆ విశేషాలు మీ కోసం.

Kangana Ranaut Emergency Movie
Kangana Ranaut Emergency Movie (Source : ANI)

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 12:25 PM IST

Kangana Emergeny Movie :బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌ లీడ్ రోల్​లో తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని తాజాగా ఆ చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్​ను వెల్లడించనున్నట్లు పేర్కొంది.

"మా క్వీన్‌ కంగనా రనౌత్‌పై మీరు చూపుతున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. దేశం కోసం తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి, దేశానికి సేవ చేయాలని కంగనా ఎంతో శ్రమిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె పూర్తి ప్రాధాన్యతను రాజకీయాలకు కేటాయిస్తున్నారు. అందుకే ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం. త్వరలోనే మరో కొత్త రిలీజ్ డేట్​ను ప్రకటిస్తాం. ఈ సినిమా కచ్చితంగా మీకు నచ్చుతుందని మేము హామీ ఇస్తున్నాం. నిరంతరం మాకు సపోర్ట్‌ చేస్తున్నందుకు కృతజ్ఞతలు" అంటూ ఆ పోస్ట్​లో కంగనా టీమ్ వెల్లడించింది.

గతంలో ఈ సినిమాను 2023 నవంబర్ 24న విడుదల చేయనున్నాట్లు ప్రకటించింది. కానీ ఆ తర్వాత అది కాస్త వాయిదా పడింది. ఇక ఈ ఏడాది జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు సరికొత్త డేట్ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు అది కూడా వాయిదా పడింది.

ఇక 'ఎమర్జెన్సీ' సినిమా విషయానికి వస్తే, కంగనా రనౌత్‌ డైరెక్షన్​లో వచ్చిన ఈ చిత్రం స్వతంత్ర భారతదేశంలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని రూపొందింది. ఇందులో కంగన, ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. అంతే కాకుండా కంగనా ఈ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

మరోవైపు ఈ సినిమాలో జయప్రకాశ్​ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు.

అప్పట్లో కంగనా ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో చెప్పుకొచ్చారు. తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ దీని కోసం తాకట్టు పెట్టినట్లు చెప్పారు. తొలి షెడ్యూల్ సమయంలో ఆమె డెంగీ బారినపడిన కూడా కూడా షూట్‌లో పాల్గొనాల్సి వచ్చిందని ఎమోషనల్ అయ్యారు.

'నా జీవితానికి ఆయన ప్రశంసలు చాలు'.. కంగన ఎమోషనల్.. ఎవరి గురించో తెలుసా?

ఎమర్జెన్సీ సినిమా కోసం కంగన ఆస్తి మొత్తం తాకట్టు పెట్టిందా?

ABOUT THE AUTHOR

...view details