Kamal Haasan Thug Life:కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ తన కెరీర్లో ఆనేక పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. సినీ ఇండస్ట్రీలో ఆయన ఓ మల్టీ టాలెంటెడ్. హీరోగానే కాకుండా ఆయన పలు సినిమాలకు స్క్రిప్ట్ రైటర్‌గా, ప్రొడ్యూసర్‌గా, డాన్స్ కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా పనిచేసి అన్నింట్లోనూ సక్సెస్ అయ్యారు. తాజాగా కమల్ ఆయనలోని మరో టాలెంట్‌ను ఆడియెన్స్‌కు పరిచయం చేయనున్నారు.
హీరో కమల్ తాజాగా లిరిసిస్ట్‌గా మారారు. తమిళ ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న 'థగ్‌లైఫ్' మూవీలో కమల్ ఓ పాట రాశారు. అయితే ఇందులో మరింత ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే? ఆయన ఈ పాటను కేవలం 2 గంటల్లోనే రాసి, రికార్డింగ్ పనులు కూడా కంప్లీట్ చేశారట. దీంతో ఈ విషయం తెలుసుకున్న మూవీ లవర్స్ కమల్‌ను తెగ పొగిడేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో కమల్ హాసన్‌తోపాటు సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్, ఐశ్వర్య లక్ష్మి కీలత పాత్రల్లో నటిస్తున్నారు. జయం రవి, జోగు జార్జి, పంకజ్ త్రిపాఠి, నాజర్, గౌతమ్ కార్తిక్ తదితరులు ఆయా పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మణిరత్నం దర్శతక్వం వహిస్తుండగా రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అండ్ మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై కమల్ హాసన్, శివ అనంతి, ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.