తెలంగాణ

telangana

రికార్డు స్థాయిలో కల్కి ఓపెనింగ్స్​- ఎన్ని కోట్లంటే? - Kalki 2898 AD Collections

By ETV Bharat Telugu Team

Published : Jun 28, 2024, 3:12 PM IST

Updated : Jun 28, 2024, 5:29 PM IST

Kalki 2898 Day 1 Collection: పాన్ఇండియా స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన 'కల్కి' గురువారం రిలీజై థియేటర్లలో సందడి చేస్తోంది. మరి ఈ సినిమా తొలిరోజు ఎంత వసూళ్లు సాధించిందంటే?

Kalki 2898 Day 1 Collection
Kalki 2898 Day 1 Collection (Source: ETV Bharat)

Kalki 2898 Day 1 Collection:రెబల్​స్టార్ ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమా 'కల్కి' జూన్ 27న రిలీజై థియేటర్లలో సందడి చేస్తోంది. సూపర్ హిట్​ టాక్​తో హౌస్​ఫుల్​ షోస్​తో రన్​ అవుతోంది. ఈ క్రమంలో రిలీజైన తొలిరోజే కల్కి భారీ స్థాయిలో వసూళ్లు సాధించింది. వరల్డ్​వైడ్ డే-1 రూ.191.50 కోట్ల కలెక్షన్ చేసినట్లు మూవీ టీమ్ అఫీషియల్​గా అనౌన్స్​ చేసింది. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో 'కల్కి' ఇండియన్ సినిమాలో మూడో బిగ్గెస్ట్ ఓపెనర్​గా నిలిచి చరిత్ర సృష్టించినట్లైంది. ఈ లిస్ట్​లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ రూ.223.5, బాహుబలి- 2 రూ.214.5 టాప్​లో ఉన్నాయి.

ఓవర్సీస్​లోనూ కల్కి దూకుడు
నార్త్‌ అమెరికాలోనూ కల్కి ఆల్‌ టైమ్‌ రికార్డును క్రియేట్ చేసింది. నార్త్‌ అమెరికాలో ప్రీ సేల్‌ బుకింగ్స్‌లోనే పలు చిత్రాల రికార్డులను అధిగమించిన కల్కి టాప్‌లో నిలిచింది. ప్రీమియర్స్‌ కలెక్షన్స్‌లోనే 3.8 మిలియన్‌ డాలర్లతో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డును సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ప్రీమియర్స్‌, మొదటిరోజు కలెక్షన్స్‌ అన్నీ కలిపి అమెరికాలో మొత్తంగా 5 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది. అలాగే అత్యంత వేగంగా 5 మిలియన్లు వసూలు చేసిన సినిమాగానూ రికార్డును నెలకొల్పింది.

సినిమా తీసింది అందుకోసం కాదు!
'కల్కి' రిలీజ్ సందర్భంగా సినిమా ఏయే రికార్డులు బ్రేక్ చేసింది? కొత్త రికార్డులు క్రియేట్ చేసిందా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్ట్​లు చేస్తున్నారు. అయితే ఈ రికార్డుల అంశంపై కల్కి నిర్మాతల్లో ఒకరైన స్వప్నదత్ స్పందించారు. రికార్డుల కోసం ఈ సినిమా తీయలేదని అన్నారు. 'కల్కి ఇతర సినిమాల రికార్డులను క్రాస్ చేసిందా అని ఫ్యాన్స్ ఫోన్ చేసి అడుగుతున్నారు. ఇది నాకు ఆశ్చర్యం కలిగించింది. రికార్డులు క్రియేట్ చేసిన వారెవ్వరూ మళ్లీ మళ్లీ వాటికోసమే సినిమాలు తీయరు. మేము ఆడియెన్స్​ కోసమే సినిమా తీశాం. చాలా ప్రేమతో ఈ సినిమా రూపొందించాం' అని స్వప్నదత్ అన్నారు.

'కల్కి' కలెక్షన్ రికార్డ్స్​పై నిర్మాత స్పప్న దత్​ ఇంట్రెస్టింగ్​ పోస్ట్​

'కల్కి' యాక్షన్ సీక్వెన్స్ వెనక ఉన్న రియల్ హీరో ఇతడే! - మేకింగ్ వీడియో చూశారా? - Kalki 2898 AD Making Video

Last Updated : Jun 28, 2024, 5:29 PM IST

ABOUT THE AUTHOR

...view details