Kalki 2898 AD Prabhas Entry :రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ 'కల్కి 2898 AD'. సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమాకు సంబంధించిన పలు ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్‌ను రివీల్ చేయగా, తాజాగా ఇన్‌స్ట్రాగ్రామ్ లైవ్‌లోనూ ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా నాగ్ అశ్విన్, హీరో ప్రభాస్‌తో కలిసి ఇన్స్టాగ్రామ్ వేదికగా లైవ్ వచ్చారు. ప్రభాస్‌తో ముచ్చటించిన ఆయన ఫ్యాన్స్ కోసం సూపర్ అప్డేట్స్ను షేర్ చేశారు. ఇక డార్లింగ్ కూడా పలు సీక్రెట్స్‌ను రివీల్ చేశారు.
"క్లైమాక్స్‌లో ఓ సర్ప్రైజ్ సాంగ్ ఉంటుంది. సెకెండాఫ్‌లో దాదాపు 80 శాతం యాక్షన్ సీన్సే ఉంటాయి. ఇక మూవీ స్టార్ట్ అయిన 20-22 నిమిషాలకు ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. ఇది బెస్ట్ ఇంట్రో సీన్ అని నా అభిప్రాయం"అంటూ నాగీ వెల్లడించారు.
ఇక ప్రభాస్ కూడా ఈ సినిమాకు సీక్వెల్ ఉన్నట్లు హింట్ ఇచ్చేశారు. అంతే కాకుండా దుల్కర్ సల్మాన్, విజయ్‌దేవరకొండకు ఇదే లైవ్‌లో స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. దీంతో నాగ్ అశ్విన్ ఈ చిత్రంలో వాళ్లిద్దరూ కూడా ఉన్నారంటూ రివీల్ చేశారు.