Kalki Overseas Collection:రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కల్కి 2898 AD బౌండరీలు దాటుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే భారీ స్థాయిలో ఓపెనింగ్ డే వసూళ్లు చేసిన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్లో చేరిపోయింది. అటు ఓవర్సీస్లోనూ కల్కి జోరు ప్రదర్శిస్తోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే ఓవర్సీస్లో రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది.
ఫస్ట్ వీకెండ్ నార్త్ అమెరికాలో కల్కి కాసుల వర్షం కురిపిస్తోంది. 11+ మిలియన్ డాలర్ల కలెక్షన్ సాధించింది. ఈ క్రమంలో నార్త్ అమెరికాలో తొలి వీకెండ్ అత్యధిక వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
ఇక సినిమాకు ఆల్ ఓవర్‌గా పాజిటివ్ టాక్ ఉండటం వల్ల రానున్న రోజుల్లో ఈ మూవీ కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉన్నాయని సమాచారం. కాగా, నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ ఫిల్మ్స్‌లో టాప్ 2 సినిమాలు (కల్కి, బాహుబలి 2) కూడా ప్రభాస్‌వే కావడం విశేషం. ఇక కెనడాలోనూ ఈ సినిమా భారీ స్థాయిలోనే కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కెనడాలో రిలీజైన తెలుగు సినిమాల్లోకెల్లా అన్నింటికంటే అత్యధికంగా గ్రాస్ సాధించిందట.
నాలుగు రోజుల్లో కల్కి ఓవర్సీస్ కలెక్షన్సు (ప్రీమియర్స్‌తో కలిపి)
- యూకే- రూ.9.38 కోట్లు
- ఆస్ట్రేలియా- రూ.9.18 కోట్లు
- జర్మనీ- రూ.1.30 కోట్లు
- న్యూజిలాండ్- రూ.93.75 లక్షలు