Kalki 2898 AD Mathura:రెబల్ స్టార్ ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి AD 2898' విడుదల దగ్గరపడుతోంది. దీంతో మూవీటీమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. మేకర్స్ సినిమాను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందించిన బుజ్జి (కారు)ని దేశంలో పలు ప్రధాన నగరాల్లో తిప్పి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఇక తాజాగా మూవీటీమ్ ఉత్తర్‌ప్రదేశ్ మథురలో సందడి చేసింది.
శ్రీకృష్ణ జన్మస్థానం 'మథుర'లో నటి శోభన, పలువురు నృత్యకారిణులు నది ఒడ్డున సాంస్కృతిక నృత్య ప్రదర్శన చేశారు. నటీమణులు నృత్యంతో స్థానికంగా అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ వీడియోను మూవీటీమ్ 'థీమ్ ఆఫ్ కల్కి' పేరుతో సోమవారం రిలీజ్ చేసింది. ఆధ్యాత్మిక ప్రదేశంలో సినిమాను ఇంత సంప్రదాయ రీతిలో ప్రమోట్ చేయడం బాగుంది అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మరి ఈ వీడియోను మీరు చూశారా?
బుకింగ్స్ స్టార్ట్:ఈ సినిమా వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా జూన్ 27న రిలీజ్ కానుంది. విడుదల రోజు ఉదయాన్నే 5.30 గంటలకు ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ క్రమంలో ఆదివారం నుంచే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో భారీ స్థాయిలో టికెట్లు అమ్ముడవుతున్నాయి. క్షణాల్లోనే టికెట్లు సోల్డ్ ఔట్ అవుతున్నాయి.