Kalki Movie Collection:రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 AD' తెలుగు సినిమా రేంజ్‌ను భారీగా పెంచేసింది. చివరి వారంలోనూ భారీ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ భారతదేశంలోని అతి పెద్ద గ్రాసర్ సినిమాల్లో చోటు దక్కించుకుంది. జూన్ 27న విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ థియేటర్లలో హవా కొనసాగిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1300కోట్లుకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించింది.
'కల్కి 2898 AD' చిత్రం 2024 సంవత్సరంలో విడుదలైన అతిపెద్ద హిట్ సినిమాగా నిలిచింది. 40వ రోజు వరకూ మంచి ఆదరణ పొందుతూ కొత్త కొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పటి వరకూ ఈ సినిమా అన్ని దేశవ్యాప్తంగా భాషల్లో కలిపి రూ.760కోట్లుకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమా ఆల్ టైమ్ ఇండియా కలెక్షన్స్ రికార్డును కూడా బ్రేక్ చేసింది. ఇండియన్ బాక్సాఫీస్‌లో 'జవాన్' సినిమా ఆల్ టైమ్ కలెక్షన్స్ రూ.760కోట్లు. అంతేకాదు భారతీయ చలనచిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా 'కల్కి 2898 AD' నిలిచింది. గతంలో 'బాహుబలి- 2', 'KGF-2', 'ఆర్ఆర్ఆర్' సినిమాలు ఈ ఫీట్ సాధించాయి.
టికెట్ ధర తగ్గింపు
మొదట్లో టికెట్ రేట్లు భారీగానే ఉండగా తాజాగా ధరలను తగ్గించింది. అయినప్పటికీ సినిమా కలెక్షనల్లో ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. మొదటి వారంలో రూ.414.85కోట్లు, రెండో వారంలో రూ.128.5కకోట్లు, మూడో వారంలో రూ.56.1కోట్లు, నాలుగో వారంలో రూ.24.4కోట్లు, ఐదో వారంలో రూ.121 కోట్లు వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఆరో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ మొత్తం రూ.760కోట్లు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఆగస్టు 15వరకూ 'కల్కి' ఇదే హవాను కొనసాగించే అవకాశాలున్నాయని సినీ పరిశ్రమ అంచనా వేస్తోంది.