Kalki 2898 AD Guest Roles :రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన 'కల్కి 2898AD' మూవీకి సంబంధించిన రిలీజ్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. మొదటి దానికంటే ఎన్నో సర్ప్రైజులతో ఉన్న ఆ గ్లింప్స్ ప్రస్తుతం అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఇదివరకు ఉన్నవారు కాకుండా పలువురు కొత్త నటీనటులు ఇందులో కెమియో లేకుంటే మెయిన్ రోల్స్‌లో కనిపించి ఆడియెన్స్‌ను ఆశ్చర్యపరిచారు. అయితే తాజాగా మరో సెన్సేషనల్ జోడీ కూడా ఈ చిత్రంలో భాగమైనట్లు నెట్టింట ఓ రూమర్ తెగ్ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ వారెవరంటే?
'సీతారామం' సినిమాతో సెన్సేషనల్ జోడీగా పేరొందారు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జోడీ. ఆ సినిమాలో వారి నటనకు ఎంతో మంది ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. డీసెంట్ లుక్స్‌తో పాటు క్లీన్ కెమిస్ట్రీ వల్ల ఎంతో మందికి ఈ జోడీ తెగ నచ్చింది. ఇప్పుడు ఈ ఇద్దరే మళ్లీ జంటగా కనిపించనున్నారట. 'కల్కి' సినిమాలో ప్రభాస్ తల్లిదండ్రులుగా నటించనున్నారట. ఇప్పుడు ఇదే విషయంపై సినీ వర్గాల్లో తెగ చర్చలు జరుగుతున్నాయి.
విష్ణుయశస్, సుమతిలుగా ప్రాధాన్యం కలిగిన రెండు పాత్రల్లో ఈ ఇద్దరూ స్క్రీన్‌పై మెరవనున్నారట. అయితే వీరిద్దరూ సినిమాలో కనిపించేది కాసేపే అయినప్పటికీ ఆ పాత్రలను మేకర్స్ చాలాకాలం పాటు గుర్తుండిపోయేలా తీర్చిదిద్దారట. చూస్తుంటే మళ్లీ దుల్కర్, మృణాల్ తమ నటనతో మరోసారి అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నట్లు తెలుస్తోంది.