Kalki 2898 AD Deepika Padukone Favourite Tollywood Hero :తన నటనతో బాలీవుడ్లో ఎంతో మంది అభిమానులను, సన్నిహితులను సంపాదించుకుంది స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. హాలీవుడ్‌లోనూ సినిమా చేసి మరింత స్టార్డమ్ అందుకుంది. అలానే అక్కడ కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మరో రోజులో కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దీపిక గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. అలానే టాలీవుడ్లో ఆమెకు ఇష్టమైన హీరోలు ఎవరో కూడా తెలుసుకుందాం.
పదిహేడేళ్ల వయసులో తన కలల కెరీర్ వెతుక్కుంటూ బెంగళూరు నుంచి ముంబయిలో అడుగు పెట్టింది దీపికా పదుకొణె. మొదటగా ఆమె కన్నడ చిత్రం ఐశ్వర్య (2006)తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ‘ఓం శాంతి ఓం’ ఆమెకు తొలి బాలీవుడ్ సినిమా. ఇది ఆమె లైఫ్‌ను మలుపు తిప్పింది.
ఆ తర్వాత చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, పఠాన్, బాజీరావు మస్తానీ, పద్మావత్, ఛపాక్, గెహ్రియాన్ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ధమ్ మారో ధమ్, బాంబే టాకీస్ లాంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. హాలీవుజ్లో ఫైండింగ్ ఫానీ, త్రిబుల్ ఎక్స్ : ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
- దీపిక మితభాషి. పార్టీలకు దూరంగా ఉంటుంది. క్రమం తప్పకుండా యోగా చేస్తుంది. నగలపై ఆసక్తి లేదు.
- ఇంటీరియర్ డిజైనింగ్ నేర్చుకుంది. మహారాష్ట్రలోని ఓ గ్రామాన్ని కూడా దత్తత తీసుకుంది.
- 2023లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రజెంటర్‌గా వ్యవహరించింది. ప్రియాంక చోప్రా తర్వాత ఆ ఘనత సాధించిన రెండో భారతీయ నటి ఈమెనే. కేన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్ జ్యూరీ సభ్యురాలిగా, ఫిఫా వరల్డ్ కఫ్ ప్రజెంటర్‌గానూ వ్యవహరించింది.
- 2021లో ఉత్తమ నటిగా గ్లోబల్ అచీవర్స్ పురస్కారం దక్కించుకుంది.
- 2022లో ప్రపంచంలోని పది మంది అందమైన మహిళల్లో ఒకరిగా నిలిచింది.
- 2013లో మోస్ట్ డిజైరబుల్ విమెన్‌గా నిలిచింది.
- రామ్ లీలా, బాజీరావు మస్తానీ, పద్మావత్ సినిమాల్లో తనతో కలిసి నటించిన రణ్వీర్ సింగ్‌ను పెళ్లిచేసుకుంది. త్వరలోనే తల్లి కానుంది.
- తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటే అభిమానం. విలక్షణ హీరో రానా క్లోజ్ ఫ్రెండ్.
ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరే అప్డేట్ - వరే వరే వరే వచ్చేశాడు రాజా సాబ్ - Rajasaab Movie
దీపికా డెబ్యూ తెలుగు సినిమా 'కల్కి 2898 AD' కాదు? ఏదో తెలుసా? - Kalki 2898 AD Movie