Kalki 2898 AD Nag Ashwin :దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబోలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD. మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ మరోవైపు విమర్శలు కూడా వస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు చూసి ఈ సినిమా హాలీవుడ్ మూవీ డ్యూన్‌ను చూసి కాపీ కొట్టారంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
తాజాగా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. ఒక్కసారిగా నవ్వేసి సెటైరికల్‌గా అదిరిపోయే సమాధానం ఇచ్చారు. "అవునా. బహుశా సినిమాలో ఉన్న ఇసుకను చూసి అలా అనుకొని ఉంటారు. మీరు ఇసుక ఎక్కడ చూసినా డ్యూన్ మూవీలానే కనిపిస్తుంది" అని రిప్లై ఇచ్చారు. కాగా, కల్కిని ఇలా వేరే హాలీవుడ్ చిత్రాలతో పోల్చడం కొత్తేమి కాదు. గతంలోనూ పలు సినిమాల రిఫరెన్స్‌లు ఉన్నాయంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే మూవీటీమ్ మాత్రం వీటిని కొట్టిపారేస్తూ వస్తోంది. ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నట్లు చెబుతోంది.