Kalki 2898 AD Celebrities Review :ఇప్పుడు ఎక్కడ చూసినా 'కల్కి' మేనియా నడుస్తూనే ఉంది. సినిమా విడుదలైనప్పటి నుంచి అభిమానుల్లో ఎంతో ఉత్సాహం పెరిగిపోయింది. నెట్టింట వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్‌లతో పాటు థియేటర్లు దద్దరిల్లిపోతున్న సీన్స్‌ను మనం చూస్తూనే ఉన్నాం. క్యారెక్టర్స్, గ్రాఫిక్స్, యాక్షన్ సీన్స్ ఇలా అన్నీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయని టాక్ నడుస్తోంది. దీంతో ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరిగిపోయింది. సాధారణ ఆడియెన్సే కాదు సెలబ్రిటీలు కూడా ఈ సినిమా చూసేందుకు బారులు తీస్తున్నారు.
తాజాగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్‌కు ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవీ, అలాగే చెల్లి కలిసి సినిమా చూసేందుకు వచ్చారు. మూవీ చూసిన తర్వాత తన అభిప్రాయాన్ని తెలియజేశారు. సినిమాను ఇంతటి హిట్ చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక చిత్రంలోని యాక్షన్ సీన్స్, ప్రభాస్ యాక్టింగ్ కూడా చాలా బాగుందని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
ఇక రివ్యూ ఇచ్చాక ఆమె అక్కడే ఉన్న 'బుజ్జీ' వెహికల్‌ను ఎక్కి సంతోషం వ్యక్తం చేశారు. అక్కడి అభిమానులకు అభివాదం చేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయారు.
'కల్కి' టీషర్ట్‌లో పవర్‌స్టార్ తనయుడు
ఇదిలాఉండగా, ఇదే ప్రసాద్ ఐమ్యాక్స్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ కూడా వచ్చాడు. ఈ సందర్భంగా అకీరా 'కల్కి' కస్టమైజ్డ్ టీ షర్ట్ ధరించాడు. దీన్ని చూసిన అభిమానులు అతడి వద్దకు వెళ్లి ఫొటోలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.