తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'కల్కి'లో టాలీవుడ్ స్టార్ నటుడు ఫిక్స్​- పాన్​వరల్డ్​ మూవీకి మరింత హైప్​ - కల్కి సినిమా స్టోరీ

Kalki 2898 AD Cast: రెబల్​స్టార్ ప్రభాస్ హీరోగా కల్కి సినిమా పాన్ వరల్డ్​ రేంజ్​లో తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో పలు ఇండస్ట్రీల లెజెండరీ నటులు నటిస్తుండగా తాజాగా టాలీవుడ్​కు చెందిన ఓ సీనియర్ నటుడు కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిసింది. ఇంతకీ ఆయనెవరంటే?

Kalki 2898 AD Cast
Kalki 2898 AD Cast

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 10:18 AM IST

Updated : Mar 1, 2024, 10:32 AM IST

Kalki 2898 AD Cast: పాన్ఇండియా స్టార్ ప్రభాస్- దర్శకుడు నాగ్​ అశ్విన్ కాంబోలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 'కల్కి AD 2898'. ఈ మూవీని నాగ్ అశ్విన్ సైన్స్​ ఫిక్షన్​ జానర్​లో తెరక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా క్షణాల్లో వైరలవుతోంది. తాజాగా కల్కికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆయా ఇండస్ట్రీల బడా నటులను ఈ ప్రాజెక్ట్​లో భాగం చేశారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్​కు చెందిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా తెలిపారు. ఓ సినిమా ఫంక్షన్​కు హాజరైన రాజేంద్ర ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాజేంద్ర ప్రసాద్ లాంటి లెజెండరీ నటుడు ఈ సినిమాలో నటిస్తున్నారంటే, దర్శకుడు నాగ్ అశ్విన్ ఆయనకు కీలక పాత్రే రాసి ఉంటారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే ఎలాంటి క్యారెక్ట్​ర్​లో అయినా ఇట్టే ఒదిగిపోయే రాజేంద్ర ప్రసాద్​ను నాగ్ అశ్విన్ అలా వాడుకుంటారో చూడాలి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్​బి అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, దీపకా పదుకొణె, దిశా పటానీ, గౌరవ్ చోప్రా తదితరులు నటిస్తున్నాట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.

అయితే ఈ సినిమా కథ మహాభారతం కాలం నుంచి మొదలై, 2898తో పూర్తవుతుందని డైరెక్టర్ అశ్విన్ రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ మూవీలో దాదాపు 6వేల సంవత్సరాల మధ్య జరిగే కథను స్క్రీన్​పై చూపించనున్నట్లు అశ్విన్ చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్​గా ఈ సినిమా థీమ్​ మ్యూజిక్​ను సంతోష్ రిలీల్ చేశారు. ఓ మ్యూజిక్ కాన్సర్ట్​లో ధీమ్ ప్లే చేసి సినిమాపై అంచనాలు పెంచారు. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్​పై అశ్వనీదత్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా 2024మే 9న వరల్డ్​వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ కాన్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.

6 వేల సంవత్సరాల కథతో 'కల్కి' - టైటిల్ సీక్రెట్ ఇదే : నాగ్​ అశ్విన్

ప్రభాస్ కల్కిలో ఎన్టీఆర్​ - అసలు విషయం చెప్పేసిన మూవీ రైటర్!

Last Updated : Mar 1, 2024, 10:32 AM IST

ABOUT THE AUTHOR

...view details