తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'వార్​ 2'లో మరో తెలుగు స్టార్ - ఈ క్యారెక్టర్ చాలా పవర్​ఫుల్​! - Jr NTR War 2 Cast - JR NTR WAR 2 CAST

Jr NTR War 2 Cast : జూనియర్ ఎన్​టీఆర్​, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్​ రోషన్ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ 'వార్ 2'. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ సెట్స్​లోకి మరో తెలుగు హీరో అడుగుపెట్టనున్నారట. ఇంతకీ ఆయన ఎవరంటే ?

Jr NTR War 2 Cast
Jr NTR War 2 Cast

By ETV Bharat Telugu Team

Published : Apr 1, 2024, 3:43 PM IST

Jr NTR War 2 Cast : యంగ్ టైగర్​ జూనియర్ ఎన్​టీఆర్​, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్​ రోషన్ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ 'వార్ 2'. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. బీటౌన్​లో ఎన్​టీఆర్ ఈ సినిమాతోనే ఫస్ట్ టైమ్ ఎంట్రీ ఇవ్వడం వల్ల అభిమానులు దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అదేందంటే ఈ సినిమాలోకి మరో తెలుగు స్టార్ ఎంట్రీ ఇవ్వనున్నారట. ఆయనెవరో కాదు మన 'ఫ్యామిలీ స్టార్' జగపతిబాబు.

ఈ సినిమాలో ఆయన జూనియర్ ఎన్​టీఆర్ తండ్రి పాత్రలో కనిపించనున్నారట. ఆ రోల్​ చాలా పవర్​ఫుల్​గా ఉంటుందని అంతే కాకుండా సినిమాకు చాలా కీలకమని అంటున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ అనౌన్స్​మెంట్ రావాల్సి ఉంది.

ఇక వార్​ 2 సినిమా విషయానికి వస్తే - యశ్‌రాజ్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హృతిక్‌ రోషన్‌, ఎన్​టీఆర్‌లకు మధ్య కీలక యాక్షన్‌ సన్నివేశాలు ఉండనున్నాయట. అంతే కాకుండా ఇందులో ఎన్​టీఆర్ ఇండియన్‌ రా ఏజెంట్‌గా కనిపించనున్నట్లు సినీ వర్గాల టాక్. ప్రస్తుతం ఆయన 'దేవర' షూటింగ్​లో బిజీగా ఉన్నందున అది పూర్తికాగానే 'వార్‌-2' సెట్స్​లోకి జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ హీరోయిన్​గా నటిస్తుండగా, అలాగే కండల వీరుడు సల్మాన్ ఖాన్, బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్ కూడా ఈ మూవీలో గెస్ట్ రోల్స్​లో కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి.

Devara Shooting : మరోవైపు 'దేవర' షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇందులో ఎన్​టీఆర్ సరసన బీటౌన్ స్టార్ జాన్వీ కపూర్ నటిస్తోంది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించారు. మరో స్పెషల్ రోల్​లో శ్రీకాంత్‌ కనిపించనున్నారు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్​లో విడుదల కానుంది.

ఎన్టీఆర్​తో సినిమా చేయాలంటే అంత బడ్జెట్ పెట్టుకోవాలా - స్వయంగా చెప్పిన యంగ్ టైగర్! - Juniour NTR Movie Budget

దేవర కోసం గోవాకు తారక్- సైఫ్​తో యాక్షన్ సీన్స్ కోసమేనట!

ABOUT THE AUTHOR

...view details